Advertisementt

బన్నీ.. ముంబైలో చక్కర్లు కొట్టింది ఇందుకేనా?

Sat 08th Sep 2018 10:04 PM
krishnamachari srikkanth,allu arjun,biopic,kapil dev  బన్నీ.. ముంబైలో చక్కర్లు కొట్టింది ఇందుకేనా?
Can Bunny Pull Off The Role In Biopic? బన్నీ.. ముంబైలో చక్కర్లు కొట్టింది ఇందుకేనా?
Advertisement
Ads by CJ

ఆ మధ్యన అల్లు అర్జున్ ముంబై రెస్టారెంట్ లో కనిపించేసరికి అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత బాలీవుడ్ మూవీ చెయ్యబోతున్నాడంటూ ఒకటే ప్రచారం జరిగింది. అయితే భార్య పిల్లల్తో అల్లు అర్జున్ ముంబై లో షికార్లు కొట్టిన మాట వాస్తవమే కానీ.. అల్లు అర్జున్ బాలీవుడ్ మూవీ ఒక రూమారంటూ కొట్టిపారేశారు. ఇక విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమా అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి కానీ.. సరైన క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. అల్లు అర్జున్ అదిగో ఇదిగో అంటున్నాడు.. అలాగే ఫ్యాన్స్ కి మంచి సినిమా కావాలంటే వెయిట్ చేయాలని మెసేజ్ ఇస్తున్నాడు కానీ.. తన నెక్స్ట్ మూవీ పై క్లారిటీ ఇవ్వడం లేదు.

అయితే తాజాగా మరోవార్త అల్లు అర్జున్ మీద ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. కపిల్ దేవ్ బయోపిక్‌లో బన్నీ నటిస్తాడంటూ గాసిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో కబీర్ ఖాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ బయోపిక్ లో అల్లు అర్జున్ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో కనిపించబోతున్నాడంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. 1983లో భారత్ కు వరల్డ్ కప్ వచ్చిన బ్యాగ్రౌండ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడనేది  నిజమో పుకారో తెలియదు కానీ.. ఆ వార్త ఇపుడు ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఇక ఆ మధ్యన అల్లు అర్జున్ ముంబై వెళ్ళింది ఈ సినిమా చర్చల కోసమే అంటూ మరో వార్త ఇప్పుడు షికారు చేస్తుంది.

అయితే అల్లు అర్జున్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ నటించిన ప్రతి తెలుగు సినిమా హిందీ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. అయితే అల్లు అర్జున్ నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకుండా మనసుకు నచ్చిన ఏదైనా కీలక పాత్ర దొరికితే బాలీవుడ్ సినిమాల్లో నటిస్తానని గతంలో అల్లు అర్జున్ చెప్పడం వల్లే.. ఇలా కపిల్ దేవ్ బయోపిక్ లో అల్లు అర్జున్ నటిస్తున్నాడని వార్త అంత త్వరగా స్ప్రెడ్ అయ్యిందంటున్నారు మెగా ఫ్యాన్స్.

Can Bunny Pull Off The Role In Biopic?:

Allu Arjun in Kapil Dev’s biopic as Krishnamachari Srikkanth

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ