తెలుగులో ఎవరికి కొదువ ఉన్నా కూడా హాస్యనటులకు మాత్రం ఎప్పటికి లేదు.. ఉండదనే చెప్పాలి. బ్రహ్మానందం హవా తగ్గింది. ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్‌నారాయణ, కొండవలస వంటి వారు అకాల మరణం పాలయ్యారు. ఇక సునీల్ హీరోగా మారి తానేదో మాస్ హీరోని కావాలనే ఉద్దేశ్యంతో కెరీర్‌ని చెడగొట్టుకున్నాడు. ఇప్పుడు మరలా కమెడియన్ రోల్స్ చేస్తానని చెప్పినా, ఆయన నటించిన రెండు మూడు చిత్రాలు హిట్టయితేనే ఆయన భవిష్యత్తు ఏమిటి అనేది తేలనుంది. మరోవైపు సప్తగిరి, షకలకశంకర్ వంటి వారు కూడా హీరోల పాత్రలపైనే దృష్టి పెడుతున్నారు. జబర్ధస్త్ వంటి షోల ద్వారా మహేష్ ‘రంగస్థలం’ చిత్రంలో అదిరిపోయే పెర్పార్మెన్స్ ఇచ్చాడు. ఇక ప్రియదర్శి కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు.
కానీ సునీల్‌తో పాటు సీనియర్లు లేని లోటును రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న కమెడియన్ మాత్రం వెన్నెలకిషోర్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన పలు భారీ స్టార్స్ చిత్రాలలో నటిస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’లో కూడా ఆయన నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో వేగంగా జరుగుతోంది. ఇందులో తాజాగా కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న కారణంగా వెన్నెలకిషోర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.
ఇక ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా ఆయన ప్రభాస్‌తో ఫొటో తీసుకుని సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈయన ఈ ఫొటోని సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియా లో వైరల్ అవుతోంది. ఎంతో విలువైన ఈ ఫొటోని ఎల్లకాలం దాచుకుంటానని ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు.