Advertisementt

ఇండస్ట్రీతో పనిలేదు .. నాగ్ దున్నేస్తున్నాడు

Sat 08th Sep 2018 02:58 PM
nagarjuna,dhanush,tamil movie,brahmastra,tollywood king  ఇండస్ట్రీతో పనిలేదు .. నాగ్ దున్నేస్తున్నాడు
Nagarjuna in Tamil Movie ఇండస్ట్రీతో పనిలేదు .. నాగ్ దున్నేస్తున్నాడు
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ లో చేస్తున్న సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. అయితే నాగ్ కన్ను ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ పైన పడింది. తమిళంలో నాగ్ ఓ సినిమా ఒప్పుకున్నాడట. త్వరలోనే అది సెట్స్ మీదకు వెళ్లబోతోందని సమాచారం. దానికి డైరెక్టర్ ఎవరో కాదు రజినీకాంత్ అల్లుడు ధనుష్ ఆ సినిమాకి డైరెక్టర్.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారమే స్టార్ట్ అయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట నాగ్. తెలుగులో ‘దేవదాస్’ తో పాటు బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ మూవీలో నటిస్తున్నాడు నాగ్. వీటితో పాటు కోలీవుడ్ లో ధనుష్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ్ తో పాటు తమిళ నటులు శ్రీకాంత్, ఎస్ జే సూర్య, శరత్ కుమార్ కూడా కీలకపాత్రలు పోషించబోతున్నారు. 

ఇక హీరోయిన్స్ గా అదితిరావు హైదరి, మేఘా ఆకాష్ కనిపించనున్నారు. అయితే ఇందులో నాగ్ ది ఫుల్ లెంగ్త్ పాత్ర కాదట. 20 నిమిషాలు మాత్రమే కనిపించనున్నాడని టాక్. తన గెటప్ కూడా చాలా కొత్తగా ఉంటుందనే విషయాన్ని నాగ్ ఇప్పటికే బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Nagarjuna in Tamil Movie:

Nagarjuna in Tamil star Hero Dhanush Direction

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ