Advertisementt

అబ్బా.. రకుల్ ఎంతందంగా ఉందో!

Sat 08th Sep 2018 01:52 PM
rakul preet singh,photoshoot,pic,hulchal,social media  అబ్బా.. రకుల్ ఎంతందంగా ఉందో!
Rakul Latest Pic Hulchal in social media అబ్బా.. రకుల్ ఎంతందంగా ఉందో!
Advertisement
Ads by CJ

కెరటం అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా చేశాక కెరీర్ లో నిలదొక్కుకుంది. ఇక మొదట్లో చిన్న సినిమాల్లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోయిన రకుల్ ప్రీత్ కి స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడానికి ఆట్టే సమయం పట్టలేదు. రకుల్ టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోకపోయినా... స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ టాప్ చైర్ కి దగ్గరగానే ఉంది. మంచి బాడీ ఫిట్నెస్ తో అందమైన కన్నులతో... గ్లామర్ షోకి అడ్డు చెప్పని భామగా రకుల్ చాలా తక్కువ సమయం లోనే టాప్ పొజిషన్ కి వచ్చేసింది. తెలుగుతో పాటుగా తమిళంలోనూ మెల్లగా అవకాశాలు దక్కించుకున్న రకుల్ ప్రీత్ కి తెలుగు తమిళంలో ఒకేసారి మహేష్ తో కలిసి నటించిన స్పైడర్ దెబ్బకి కెరీర్ లో భారీ గ్యాప్ వచ్చేసింది. 

మహేష్ తో కలిసి నటించిన స్పైడర్ తో తెలుగు తమిళంలోనూ రకుల్ కి కోలుకోలేని దెబ్బతగిలింది. తెలుగులో అసలు ఆఫర్స్ లేకుండానే పోయాయి. తమిళంలో మాత్రం సూర్య, కార్తీ అన్నదమ్ముల సరసన నటిస్తూ కాస్త బిజీ అయ్యింది. అయితే అవకాశాలు లేకపోయినా బాడీని మంచిగా మెయింటింగ్ చేస్తూ ఇప్పటికి అంతే అందాన్ని... అంతే గ్లామర్ రకుల్ మెయింటింగ్ చేస్తుంది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రను దక్కించుకున్న ఈ సుందరి ఒక గ్లామర్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరా ఫోటో చూసిన ఎవరైనా ఇంతందాన్ని టాలీవుడ్ ఎందుకు పక్కన  పెట్టేసిందబ్బా.. అనిపించకమానదు. 

తెల్లని డిజైనర్ డ్రెస్సులో చెవులకు పెద్ద పెద్ద బుట్టలు, మేడలో చిన్నపాటి బంగారు ఆభరణం.. చేతులకు గాజులతో.. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో చాలా సింపుల్ గా తన అందాన్ని చూపిస్తుంది ఈ పంజాబీ బ్యూటీ. మరి రకుల్ ప్రీత్ కి ఒక్క స్టార్ హీరో సినిమాలో అవకాశమొచ్చినా... రకుల్ ప్రీత్ మళ్ళీ టాప్ పొజిషన్ లోకి వచ్చేయడం ఖాయం. ఇక రకుల్ కి గ్యాపొచ్చిన టైంలో హీరోయిన్ పూజాహెగ్డే ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ చైర్ కి దగ్గరయింది.

Rakul Latest Pic Hulchal in social media:

Rakul preet singh Latest PHotoshoot pic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ