Advertisementt

అజ్ఞాతవాసికి ముందు త్రివిక్రమ్‌తో అను ఇలా!

Fri 07th Sep 2018 10:50 PM
anu emmanuel,shailaja reddy alludu,interview,agnathavasi,trivikram srinivas  అజ్ఞాతవాసికి ముందు త్రివిక్రమ్‌తో అను ఇలా!
Anu Emmanuel About Agnathavasi Role అజ్ఞాతవాసికి ముందు త్రివిక్రమ్‌తో అను ఇలా!
Advertisement
Ads by CJ

మజ్ను సినిమా తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త.. ఆ తర్వాత అను ఇమ్మాన్యుయేల్‌కి ఒక్కసారిగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వచ్చేసాయి. కెరీర్ ఆరంభంలోనే పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో పక్కన అనుకి సెకండ్ హీరోయిన్ అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసిలో ఫస్ట్ హీరోయిన్ కీర్తి సురేష్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా అనుని ఎంపిక చేశాడు త్రివిక్రమ్. అయితే పెద్ద బ్యానర్ పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ అని మాత్రమే ఈ సినిమా ఒప్పుకోలేదట అను ఇమ్మాన్యువల్. ఆ సినిమా కథ విన్న తర్వాత దర్శకుడు త్రివిక్రమ్‌ని అను ఒక విషయాన్ని అడిగి కన్ఫర్మ్ చేసుకుందట.

అదేమిటంటే అజ్ఞాతవాసి లో తనకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినప్పుడు కథ విన్న అను.. నా పాత్రని అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీతలా చెయ్యరు కదా అని త్రివిక్రమ్‌ను అడగగా... అలాంటిదేం లేదు.. నీ పాత్ర ఈ సినిమాలో బావుంటుందని  చెప్పాడట మాటల మాంత్రికుడు. ఆ నమ్మకంతోనే అను అజ్ఞాతవాసిలో నటించిందట. మరి నిజంగా అను అనుకున్నట్టే అత్తారింటికి దారేదిలో ప్రణీత.. హీరోయిన్ సమంత అక్కగా డమ్మీ క్యారెక్టర్ లో నటించినట్టే.. అజ్ఞాతవాసిలో అను.. హీరో పవన్ కోసం కీర్తి సురేష్ తో పోటీ పడుతూ.. హీరో మీద పడిపోయే కేరెక్టర్ లో నటించింది. మరీ ఆ సినిమా డిజాస్టర్ కావడం.. ఈ సినిమాలో హీరోయిన్స్ పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడంతో అనుకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది.

ఇక ఆ తర్వాత చేసిన నా పేరు సూర్య కూడా ప్లాప్ అయింది. నా పేరు సూర్య కోసం గీత గోవిందం లాంటి హిట్ సినిమా వదులుకున్న అను.. ప్రస్తుతం శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఫలితం కోసం వెయిట్ చేస్తుంది. కొన్ని అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ఈ వినాయకచవితి కి విడుదల కాబోతుంది నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అను తన కెరీర్ గురించి.. కెరీర్ లో ప్లాప్ ల గురించి మీడియాతో ముచ్చటించింది. ఇక శైలజా రెడ్డి అల్లుడు హిట్ అనుకి చాలా ముఖ్యం. ఆ సినిమా హిట్ అయితేనే అనుకి మళ్ళీ టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయి. 

Anu Emmanuel About Agnathavasi Role:

Anu Emmanuel  Latest Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ