Advertisementt

‘అదుర్స్‌’లో బ్రహ్మానందం.. ‘అరవింద’లో సునీల్

Fri 07th Sep 2018 09:50 PM
sunil,aravinda sametha,jr ntr,guruvu garu,adurs,brahmi  ‘అదుర్స్‌’లో బ్రహ్మానందం.. ‘అరవింద’లో సునీల్
Sunil Role Revealed in Aravinda Sametha ‘అదుర్స్‌’లో బ్రహ్మానందం.. ‘అరవింద’లో సునీల్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘అరవింద సమేత వీరరాఘవ’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్‌తో పాటు మరికొంత మంది నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు త్రివిక్రమ్. తాజాగా ఈసినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అది కూడా కమెడియన్ సునీల్ పైన.

ఈ చిత్రంలో సునీల్ కమెడియన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సునీల్ పాత్ర మొదటి నుంచి చివరి వరకు వుంటుందట. సినిమా మొత్తంగా సునీల్ ఎన్టీఆర్ తోనే ఉంటాడంట. అయితే ‘అదుర్స్’ లో ఎన్టీఆర్.. బ్రహ్మానందంని గురువు గారు..గురువు గారు అని పిలిచినట్టు ఇందులో ఎన్టీఆర్  సునీల్ ని గురువుగారు.. గురువుగారు అని పిలుస్తాడట.

ఇందులో సునీల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా ఉంటుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ తన స్నేహితుడు సునీల్ కోసం ఎలాంటి పాత్ర తయారుచేసాడు అంటే సినిమాలో ఆల్ మోస్ట్ సునీల్ 90శాతం సీన్లలో కనిపిస్తాడట. అంతే కాదు ఓ సాంగ్ లో కూడా కనిపిస్తాడట. మరి త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగ్స్ సునీల్ ఎలా పండిస్తాడో చూడాలి. సునీల్ కమెడియన్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ వస్తున్న చిత్రం ‘సిల్లీ ఫెలోస్’ ఈ శుక్రవారం రిలీజ్ అయింది.

Sunil Role Revealed in Aravinda Sametha:

Sunil Guruvu garu for NTR in Aravinda Sametha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ