Advertisementt

సుకుమార్ - మహేష్ మూవీ షాకింగ్ అప్డేట్

Fri 07th Sep 2018 09:47 PM
  సుకుమార్ - మహేష్ మూవీ షాకింగ్ అప్డేట్
Shocking Budget to Mahesh and Sukumar Film సుకుమార్ - మహేష్ మూవీ షాకింగ్ అప్డేట్
Advertisement
Ads by CJ

'భరత్ అనే నేను' లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’తో మన ముందుకు రానున్నాడు. చాలాకాలం మహేష్ కోసం వెయిట్ చేసిన వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఈసినిమా రూపొందుతుంది. దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో అంటే ఏప్రిల్ 5న విడుదల అవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ 26వ చిత్రంగా వస్తున్న ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్ గా జరుగుతుంది. ఇది ప్రేక్షకుల మెదడకు పదును పెట్టే సినిమా కాదని 'రంగస్థలం'లా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని చెబుతున్నారు. ‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బాస్టర్ అందించిన మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ గా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

ఈ సినిమాను ఏకంగా 150కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారని సమాచారం. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను రంగంలోకి దించుతున్నారట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్. మరి ఇంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అంతలా వసూల్ చేయాలంటే ఇండస్ట్రీ హిట్ అయితే తప్ప వసూల్ చేయలేడు. మరి సుకుమార్ కి స్టోరీ పైన అంత కాన్ఫిడెన్సా? చూద్దాం ఏం అవుతుందో..

Shocking Budget to Mahesh and Sukumar Film:

Sukumar and Mahesh Babu Movie Confirmed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ