Advertisementt

చిరు సీరియస్.. మహేష్ వెనక్కితగ్గాడు

Fri 07th Sep 2018 07:18 PM
  చిరు సీరియస్.. మహేష్ వెనక్కితగ్గాడు
Can Chiranjeevi Clean MAA mess? చిరు సీరియస్.. మహేష్ వెనక్కితగ్గాడు
Advertisement
Ads by CJ

ఈ మధ్యన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో తరుచు వివాదాలు రేగుతున్నాయి. శ్రీ రెడ్డి ఇష్యు అప్పుడు బాగా డ్యామేజ్ అయిన 'మా' పరువు ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో చెలరేగిన విభేదాలతో రోడ్డున పడింది. 'మా' అధ్యక్షుడు మీద నిధుల గోల్ మాల్ వివాదం చెలరేగడం.. దానికి 'మా' కార్యదర్శి నరేష్ మద్దతు పలకడంతో ఈ వివాదం ప్రస్తుతం పీక్స్ లో ఉంది. అయితే నిధుల గోల్ మాల్ వ్యవహారంలో శివాజీ రాజా వర్గం హ్యాండ్ ఉందని నరేష్ వర్గం చేస్తున్న వ్యాఖ్యలు... ఆ వివాదంలో చిరు పేరు తెరమీదకి రావడం.. అది విన్న చిరంజీవి హర్ట్ అయినట్లుగా వార్తలు రావడం.. అలాగే సీనియర్ నరేష్, చిరు వద్దకు ఈ నిధుల గోల్ మాల్ 'మా' పంచాయితీ తీసుకెళ్లగా.. ఆయన సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని మాట ఇచ్చారని ప్రచారం జరుగుతున్న టైం లోనే ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ 'మా' వ్యవహారంలో తల దూర్చాడు.

అయితే సమస్యను పరిష్కరించడానికి మాత్రం కాదు కానీ... మహేష్ పాల్గొనాల్సిన అమెరికా ఈవెంట్ ని మహేష్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఈ వ్యవహారం బయటికెలా వచ్చిందంటే.. 'మా' సభ్యుడైన బెనర్జీ మహేష్ భార్య నమ్రత వద్దకు వెళ్లి మీరైనా జోక్యం చేసుకోవాలని కోరడం... దానికి మహేష్ భార్య నమ్రత ఈ వివాదంతో తమకేమీ సంబంధం లేదని చెప్పడమే కాదు... నమ్రత అమెరికాలో మహేష్ బాబు పాల్గొనే ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించిందనే న్యూస్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో నడుస్తుంది. ఇలాంటి  వివాదంలోకి మమ్మల్ని లాగొద్దని ఆమె సున్నితంగా చెప్పినట్టుగా సమాచారం.

మరి ఇప్పటికే చిరంజీవి ఈ విషయంలో హర్ట్ అయినట్లుగా వార్తలొస్తుంటే.. ఇప్పుడు యూఎస్ లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న మహేష్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసుకోవడం 'మా' కి షాకిచ్చే వ్యవహారమే. చూద్దాం అక్టోబర్ లో జరగబోయే ఈవెంట్ కి మహేష్ హాజరవుతాడో.. లేదో.. ఇప్పుడొస్తున్న న్యూస్ నిజమైందో కాదో అనేది.

Can Chiranjeevi Clean MAA mess?:

Chiranjeevi Angry And Hurt  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ