తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా'లో నిధుల దుర్వినియోగం విషయంపై దుమారం చెలరేగుతోంది. గతంలో పలుసార్లు మా అధ్యక్షుడైన శివాజీరాజా ఉదయ్‌కిరణ్ మరణం నుంచి రంగనాథ్ మరణం వరకు పలు ఆరోపణలు చేయడం, చిరంజీవి తనకు ఏ విధమైన సాయాన్ని చేయలేదని చెప్పడం, ఇప్పుడు అదే శివాజీరాజాపై మా జనరల్ సెక్రటరీ సీనియర్ నరేష్ తీవ్ర ఆరోపణలు చేయడం చూసిన వారు మెగా ఫ్యామిలీ సీనియర్ నరేష్‌కి అండగా ఉందని, శివాజీరాజాకి మెగా వ్యతిరేక వర్గాల మద్దతు ఉందని ప్రచారం చేస్తున్నాయి.
ఇక తాజాగా దీనిలోకి మెగా ఫ్యామిలీ అంటే అసలు పడని మంచు కుటుంబ హీరో మంచు మనోజ్ కూడా కల్పించుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంచు మనోజ్‌ని ఓ నెటిజన్ మిమ్మల్ని మా అధ్యక్షునిగా చూడాలని ఉంది బ్రదర్ అని అడిగాడు. దీనికి మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. నేను 'మా' అసోసియేషన్‌లోకి వెళ్లితే అందరు 'ఫసక్కే'. అసోసియేషన్ ఎంతో నిజాయితీగా వ్యవహరిస్తోంది.
తమపై వచ్చిన ఆరోపణలు అబద్దం అని నిరూపించుకునేందుకైనా 'మా'సభ్యులు సంఘాన్ని రివిజన్ చేస్తారు. వారేమీ చికెన్స్ కాదు పారిపోవడానికి. ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవడానికి 'మా' తాళాలు తెరిచే ఉంటాయి. నీపై వచ్చిన నిందలు తప్పు అని నిరూపించుకో 'మా'అని మంచు మనోజ్ స్పందించాడు. ఇందులో ఎంతో నిగూడార్ధం దాగి ఉన్నది అన్నది మాత్రం వాస్తవం.