Advertisementt

వామ్మో.. అమలా ఏంటిది?

Thu 06th Sep 2018 09:26 PM
amala paul,aadai look,sensation,social media  వామ్మో.. అమలా ఏంటిది?
Amala Paul aadai 1st look launched వామ్మో.. అమలా ఏంటిది?
Advertisement
Ads by CJ

అమలాపాల్‌.. వ్యక్తిగత జీవితంలోనే కాదు.. వృత్తిగత జీవితంలో కూడా నిత్యం వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నటి అమలాపాల్‌ని చెప్పవచ్చు. తెలుగులో రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌ వంటి హీరోల సరసన నటించినా రాని క్రేజ్‌ ఈ మలయాళ భామకి కోలీవుడ్‌లో వచ్చింది. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ని హడావుడిగా ప్రేమవివాహం చేసుకుంది. ఎంత వేగంగా ప్రేమించి పెళ్లి చేసుకుందో అంతే వేగంగా విడాకులిచ్చేసి బయటకు వచ్చింది. ఇక సుచీలీక్స్‌లో ఈమె పేరు కూడా విపరీతంగా హల్‌చల్‌ చేశాయి. వాటిని కూడా ఆమె తాను వార్తల్లో ఉండేందుకు ఉపయోగించుకుంది. మరోవైపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, స్టార్‌ ధనుష్‌తో ప్రేమాయణం, ఎఫైర్లు సాగిస్తూ మరోసారి కోలీవుడ్‌లో సెన్సేషన్‌ అయింది. ఇప్పటికీ ధనుష్‌కి, ఆమెకి మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ అని కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. 

ఇక విడాకుల తర్వాత మరలా సినిమాలలో హీరోయిన్‌గా రీఎంట్రీ ఇచ్చి పెళ్లికి ముందు చేసిన చిత్రాలలో కాస్త పద్దతిగా, సాంప్రదాయ బద్దంగా కనిపించిన ఈమె పెళ్లయిన తర్వాత మాత్రం తన గ్లామర్‌షో, లిప్‌కిస్‌లు, రెయిన్‌సాంగ్స్‌ వంటి వాటి ద్వారా సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. మధ్యలో పాండిచ్చేరిలో తప్పుడు అడ్రస్‌తో లగ్జరీ కారు కొని కేరళ ప్రభుత్వానికి పన్ను ఎగవేసిన కేసులో కోర్టు విచారణను ఎదుర్కొంటోంది. కాగా ఆమె ప్రస్తుతం 'ఆడై' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో సంచలనం సృష్టిస్తానని గత కొంతకాలంగా ఈమె చెబుతూ వస్తోంది. అదే మాటను నిజం చేస్తూ షాక్‌ ఇచ్చేలా ఉన్న ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. రియలిస్టిక్‌ చిత్రాలను తీయడంలో, ఆదరించడంలో ముందుండే తమిళ సినీ పరిశ్రమ ఈ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులందరికీ షాక్‌ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని చూసిన వారు. 

తెల్లని చిన్నచిన్న దుస్తులు మాత్రమే వేసుకుని, ఏడుస్తూ ఉన్న అమలాపాల్‌ ఈ చిత్రం ద్వారా సెన్సేషన్‌ సృష్టిస్తుందని కోలీవుడ్‌ పరిశ్రమ వర్గాలు ఘంటాపధంగా చెబుతున్నాయి. 'మేయాదామాన్‌' ఫేమ్‌ రత్నకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫీమేల్‌ సెంట్రిక్‌ మూవీగా రూపొందుతోంది. టైటిల్‌లో ఉన్న మూడు ఆంగ్ల అక్షరాలైన 'ఎ'లకు 'అరోగెంట్‌, ఆడషియస్‌, ఆర్టిస్టిక్‌' అనే ట్యాగులని చిత్ర యూనిట్‌ పెట్టడం చూస్తే ఈ చిత్రం బాలా చిత్రాల తరహాలో మరో సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వెల్లడవుతోంది.

Amala Paul aadai 1st look launched:

Amala Paul aadai look sensation in social media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ