సినిమాలలో కొన్నిసార్లు నటీనటులు చెప్పే డైలాగ్స్ జనజీవితంలో కూడా బాగా పాపులర్ అవుతుంటాయి. చిరంజీవి 'చేయి చూశావా.. ఎంత రఫ్‌గా ఉందో.. ఇంపాజిబుల్లా.. ఇస్తరాకుల కట్టా, గడగడ కారుతుంది.. ఇన్‌ఫ్రంట్ దేర్ ఈజ్ ఏ క్రోకడైల్ ఫెస్టివల్, బ్రహ్మానందం చెప్పిన 'జఫ్ఫా, నీ ఎంకమ్మ, ఇక ఫటాఫట్, తుత్తి... ఇలా ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఎన్నో ఉంటాయి. ఆమధ్య నాగబాబు వర్మని ఉద్దేశించి చేసిన అకుపక్షి, బాలకృష్ణ దబిడదిబిడ, తెలుగు సినీ వేడుకల్లో చిరంజీవికి లెజెండ్ పురస్కారం ఇచ్చినప్పుడు నిర్వాహకులను ఉద్దేశించి మోహన్‌బాబు అన్న 'సిల్లీఫెల్లోస్' (ఇదే డైలాగ్ 'బుజ్జిగాడు' చిత్రంలో కూడా మోహన్‌బాబునే వాడాడు'.. ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇక తాజాగా మోహన్‌బాబుకి చెందిన ఓ వీడియో క్లిక్ బాగా పాపులర్ అవుతోంది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి మోహన్‌బాబు ఆంగ్లంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వాడిన 'ఫసక్' అనే పదం బాగా పాపులర్ అవుతోంది. దీనిని ఒక ఇంగ్లీష్ బూతు పదానికి పర్యాయపదంగా వాడినట్లుగా కనిపిస్తోంది. ఈ పదానికి సంబంధించిన పలు స్ఫూప్ వీడియోలు నెట్‌లో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఆ ట్రోలింగ్‌ని మోహన్‌బాబు ఎంతో స్పోర్టివ్‌గా తీసుకున్నాడు. 'ఫసక్' అనే పదం ట్రెండింగ్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. దాదాపు 200 స్పూర్ఫ్ వీడియోలు చేశారని మంచు విష్ణు తెలిపాడు. కొన్ని చూశాము. ఎంతో క్రియేటివ్‌గా, ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి అని తెలిపాడు. ఇక మంచు విష్ణు, లక్ష్మి, మనోజ్‌లు కూడా 'ఫసక్' హ్యాష్‌ట్యాగ్‌తో ఆసక్తికర ట్వీట్స్ చేశారు.