Advertisementt

పూరి కన్ను ఆ హీరోపై పడింది..!

Thu 06th Sep 2018 02:30 PM
  పూరి కన్ను ఆ హీరోపై పడింది..!
Puri wants to direct Vijay Deverakonda పూరి కన్ను ఆ హీరోపై పడింది..!
Advertisement
Ads by CJ

తన కెరీర్‌లో అచ్చు పవన్‌కళ్యాణ్‌, రవితేజ వంటి హీరోల యాటిట్యూడ్‌కి సరిపోయే డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌, స్టైల్‌కి అనుగుణంగా తనదైన శైలిలో హీరోల పాత్రలను విభిన్నంగా తీర్చిదిద్దడంతో పూరీ జగన్నాథ్‌ శైలి విభిన్నం. పవన్‌తో 'బద్రి' అయినా రవితేజతో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్‌, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', మహేష్‌బాబుతో పోకిరి, బిజినెస్‌మేన్‌.. ఇలా తనదైన శైలిలో చిత్రాలు తీసే పూరీ జగన్నాథ్‌కి ఈమధ్య సరైన మాస్‌ స్టైల్‌ ఉన్న హీరోలు దొరకడం లేదు. ఆయన చూపించే హీరోయిజంకి నితిన్‌, కళ్యాణ్‌రామ్‌, వరుణ్‌తేజ్‌ వంటివారు సూట్‌ కాలేదు. 

ఇక 'రోగ్‌, మెహబూబా' వంటి చిత్రాలతో పాటు బాలకృష్ణ వంటి వారు కూడా ఆయన కెరీర్‌ని కాపాడలేకపోయారు. కానీ ఇప్పుడు మరలా ఎలాగైనా పూరీ తన మార్కు చిత్రంతో మరలా ఫామ్‌లోకి రావాలని ఎదురు చూస్తూ ఎంతో కసిగా ఉన్నాడు. ఖచ్చితంగా పూరీ హీరోలు ఎలా బిహేవ్‌ చేస్తారో అదే యాటిట్యూడ్‌తో అదే తరహా హీరోయిజంతో ఈమధ్య కాలంలో యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌దేవరకొండ ఓ సంచలనంగా మారాడు. దాంతో పూరీ కన్ను ప్రస్తుతం విజయ్‌దేవరకొండపై పడిందని అంటున్నారు. ఇక 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మహానటి, గోతగోవిందం' చిత్రాల తర్వాత ఎందరో నిర్మాతలు విజయ్‌ డేట్స్‌ కోసం క్యూలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన 'ట్యాక్సీవాలా, నోటా' చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. 

మరోవైపు ఆయన 'మిస్టర్‌ కామ్రేడ్‌' తో పాటు మరో రెండు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. మరో రెండు మూడు చిత్రాల కథలు రెడీ అవుతున్నాయి. ఇక 'అర్జున్‌రెడ్డి' సందర్భంగా ఆ చిత్రంపై వచ్చిన విమర్శలను కొట్టిపారేస్తూ విజయ్‌కి, దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాలకు రాంగోపాల్‌వర్మ అండగా నిలిచాడు. విజయ్‌కి కూడా వర్మతో సత్సంబంధాలున్నాయి. ఈ నేపధ్యంలో వర్మ రికమండేషన్‌తో ఆయన ప్రియ శిష్యుడైన పూరీ జగన్నాథ్‌ విజయ్‌తో చిత్రం చేయాలని భావిస్తున్నాడట. మరి అదృష్టం పూరీని వరిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!

Puri wants to direct Vijay Deverakonda:

Puri Jagannadh Eye on Vijay Deverakonda

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ