Advertisementt

ప్రేక్షకులకు బోర్‌ కొడితే వెళ్లిపోతానంటోంది

Thu 06th Sep 2018 11:21 AM
  ప్రేక్షకులకు బోర్‌ కొడితే వెళ్లిపోతానంటోంది
Rakul preet singh about his Career ప్రేక్షకులకు బోర్‌ కొడితే వెళ్లిపోతానంటోంది
Advertisement
Ads by CJ

తెలుగులో రెజీనా, రాశిఖన్నా వంటి వారితో పాటు అటు ఇటుగా పరిశ్రమలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఢిల్లీ భామ, పంజాబీ యువతి రకుల్‌ప్రీత్‌సింగ్‌. పలు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాలలో కూడా నటించింది. 'కెరటం' వంటి చిత్రాలలో నటించినా కూడా ఈమెకి పెద్ద హిట్‌ని అందించిన చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'. దీని తర్వాత ఆమె 'లౌక్యం, కిక్‌2, కరెంట్‌తీగ, పండగచేస్కో, బ్రూస్‌లీ, ధృవ, సరైనోడు, నాన్నకు ప్రేమతో, స్పైడర్‌, రారండోయ్‌ వేడుకచూద్దాం, విన్నర్‌, జయజానకి నాయకా, స్పైడర్‌' వంటి చిత్రాలలో టాప్‌స్టార్స్‌ సరసన నటించింది. అదే సమయంలో తమిళ, కన్నడ భాషల్లో కూడా పలువురు స్టార్స్‌తో యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆమెకి తెలుగులో పెద్దగా ఆఫర్లు లేవు. 'జయజానకి నాయకా, స్పైడర్‌' చిత్రాలు ఆశించిన విజయాలను సాధించలేకపోయాయి. 

కానీ ప్రస్తుతం ఆమె తమిళంలో సూర్య, తమ్ముడు కార్తి, శివకార్తికేయన్‌ వంటి పలువురు స్టార్స్‌తో నటిస్తోంది. తాజాగా ఈమె తన కెరీర్‌ గురించి స్పందిస్తూ, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు ఉన్న ఫేమ్‌ రేపు ఉండకపోవచ్చు. వాస్తవాలను ఒప్పుకుంటే ఎలాంటి భయాలు ఉండవు. నా పరుగు ఎప్పుడు ఆపాలో నాకు తెలుసు. ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నప్పుడు నా అంతట నేనే ఫీల్డ్‌కి దూరంగా వెళ్లతాను అని చెప్పుకొచ్చింది. 

ఇక ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్‌ బయోపిక్‌లో క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ సరసన అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలుగులో మాత్రం ఈ అమ్మడి జోరు తగ్గిందనే చెప్పాలి. ముఖ్యంగా సాయిపల్లవి, కీర్తిసురేష్‌, అనుపమా పరమేశ్వరన్‌, నివేదాథామస్‌, అను ఇమ్మాన్యుయేల్‌, రష్మిక మందన్న వంటివారి రాకతో ఈమె స్పీడుకి బ్రేక్‌లు పడ్డాయి. 

Rakul preet singh about his Career:

No Movies to Rakul preet singh in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ