కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్ గా నిలించింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ పాత్రలో నటించారు. ఇప్పటికి ఆ సినిమా అంటే పడి చచ్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. రీసెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయిన 'గీత గోవిందం' సినిమాలో కూడా ‘భారతీయుడు’ రిఫరెన్స్ ఉంటుంది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కించనున్నారని తెలిసిందే.
దీనికి ‘భారతీయుడు 2’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. దానికి సంబంధించి అఫీషియల్ గా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ లో కూడా కమల్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ '2.ఓ' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే మరోపక్క ఈ సినిమాకు సంబంధించిన పనులు కూడా చూసుకుంటున్నారు. అందుకుగాను శంకర్ ఆంధ్రప్రేదేశ్ లోని కడప లో ఒక లొకేషన్స్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
ఇందులో కమల్ తో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు. ప్రముఖ నిర్మాత ఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో నయనతారను కథానాయికగా తీసుకోనునున్నారని సమాచారం. మరి ఇది ‘భారతీయుడు’ తలదన్నేలా ఉంటుందా? లేదా? చూడాలి. ఈసినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.