Advertisementt

మ‌గ‌ధీర తరహా ఫైట్.. మళ్లీ చరణ్ సినిమాలోనే

Wed 05th Sep 2018 07:17 PM
magadheera range fight,ram charana,boyapati srinu,rc 12  మ‌గ‌ధీర తరహా ఫైట్.. మళ్లీ చరణ్ సినిమాలోనే
RC 12 Movie Latest Update మ‌గ‌ధీర తరహా ఫైట్.. మళ్లీ చరణ్ సినిమాలోనే
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో మొదటిసారి తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం అజ‌ర్ బైజాన్‌ అనే దేశంలో కొత్త కొత్త లొకేషన్స్ లో జరుగుతుంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ని పక్కా మాస్ హీరోలా బోయపాటి చూపిస్తాడనే టాక్ ఉంది. ఇప్పటి వరకు బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల్లో హీరోల హీరోయిజాన్ని పిండేశాడు. హీరో గారి హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చెయ్యగల దర్శకుడు బోయపాటి. హీరోలో కసి, కోపం, ఉగ్రరూపం, ఎనర్జీ లెవల్స్ అన్ని కూడా పూర్తిగా బయటికి తియ్యగల దర్శకుడు బోయపాటి. అందుకే ఎప్పటిలాగే రామ్ చరణ్ హీరోయిజాన్ని కూడా బోయపాటి ఈ సినిమాలో చూపించబోతున్నాడట.

అజ‌ర్ బైజాన్‌లో జరిగే షూటింగ్ లో ఎక్కువ శాతం యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని.. ఆ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి అత్యంత కీలకమని చెబుతున్నారు. అజ‌ర్ బైజాన్‌ దేశంలో రామ్ చరణ్ - బోయపాటిల RC12 షూటింగ్ దాదాపుగా 25 రోజులపాటు నిర్విరామంగా జరుగుతుందని... ఈ 25 రోజులు కూడా కేవలం యాక్షన్ సీన్స్ నే చిత్రీకరిస్తారని సమాచారం. ఒక యాక్ష‌న్ ఎపిసోడ్‌..... దాని లీడ్ సీన్ల కోస‌మే చిత్ర‌బృందం అంత దూరం కొత్త లొకేషన్స్ కోసం వెళ్లిందట. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం బోయపాటి చాలా కసరత్తులు చేశాడని.. రామ్ చరణ్ మగధీర సినిమాలో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ కి ధీటుగా ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ని బోయపాటి తెరకెక్కించబోతున్నాడట.

రామ్‌చ‌ర‌ణ్ కెరీర్ లో మ‌గ‌ధీర సినిమాకి అందులోని యాక్షన్ సన్నివేశాలకు ఎంతగా పేరొచ్చిందో.... దాన్ని మించేలా ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ ని రూపొందిస్తున్న బోయపాటి.... ఇది కూడా మ‌గ‌ధీర‌లానే రెండు కొండ‌ల మ‌ధ్య‌, గుట్ట‌ల మ‌ధ్య‌.. లోయ‌ల్లో తెర‌కెక్కిస్తున్నాడ‌ని టాక్‌. ఇక ఈ సినిమాలో నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని... ఆ నాలుగు యాక్షన్ సీన్స్ కూడా నాలుగు డిఫరెంట్ స్టయిల్స్ లో మాస్ అభిమానులతో పాటుగా మెగా అభిమానులను అలరిస్తాయని చెబుతున్నారు. ఇకపోతే చరణ్ -బోయపాటి సినిమా సంక్రాంతి కానుకగా విడుదలకు మేకర్స్ ప్లాన్ చేశారు.

RC 12 Movie Latest Update:

MagaDheera Range Fight in Ram Charana and Boyapati Srinu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ