Advertisementt

విజయ్ కోసం ఆ డైరెక్టర్ వెయిట్ చేస్తాడా?

Wed 05th Sep 2018 06:01 PM
vijay deverakonda,maruthi,arjun reddy,geetha govindham,shailaja reddy alludu  విజయ్ కోసం ఆ డైరెక్టర్ వెయిట్ చేస్తాడా?
Vijay Deverakonda movie with Director Maruthi విజయ్ కోసం ఆ డైరెక్టర్ వెయిట్ చేస్తాడా?
Advertisement
Ads by CJ

రెండే రెండు సినిమాలు విజయ్ ని స్టార్ హీరోల సరసన చేర్చేశాయి. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల్తో సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమాల మీద పిచ్చ ఆసక్తి ట్రేడ్ అండ్ ప్రేక్షకుల్లోనూ ఉంది. విజయ్ దేవరకొండ నోటా, టాక్సీవాలా సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంకా విజయ్ చేతిలో డియర్ కామ్రేడ్ సినిమా ఉంది. అయితే విజయ్ దేవరకొండతో సినిమాలు చేయాలని టాలీవుడ్ లో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ గట్టి ప్రయత్నాలే ప్రారంభించేశారు. అందులో పూరి జగన్నాధ్, మారుతీ ఉన్నారనే టాక్ టాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. అయితే పూరితో సినిమా లేదని విజయ్ దేవరకొండ తేల్చేశాడు. 

కానీ ఇప్పుడు భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజా రెడ్డి అల్లుడు ఫేమ్ మారుతితో విజయ్ దేవరకొండ సినిమా ఉండబోతుంది అంటూ ఫిలింసర్కిల్స్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే దర్శకనిర్మాతలు విజయ్ తో సినిమాలు చేసేందుకు అడ్వాన్సులు ఇవ్వడానికి రెడీ అయ్యి మరీ విజయ్ దేవరకొండ ఇంటిముందు క్యూ కట్టారట. డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని విజయ్ కూడా 10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడనే టాక్ అందిస్తుండగా.. తాజాగా మారుతీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మాణంలో విజయ్ తో సినిమా అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

యూవీ క్రియేష‌న్స్‌లో ఒక సినిమా చేయ‌డానికి విజ‌య్ ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే అదే యువీ సంస్థ‌తో మారుతి కూడా ఒక సినిమా చేయాల్సివుంది. అందుకే ఈ మారుతి కి విజయ్ దేవరకొండకి జోడీ కుదిరింద‌ని టాక్‌. ప్ర‌స్తుతం శైల‌జారెడ్డి అల్లుడు విడుదల, ప్రమోషన్స్ తో బాగా బిజీగా ఉన్నాడు మారుతి. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో మారుతీ సినిమా ఉందనడానికి ప్రస్తుతం అయితే డౌట్. ఎందుకంటే విజయ్ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు అయ్యేవరకు మారుతీ వేచి చూడాలి. మరి ఈలోపు మరో హీరోతో మారుతీ ఒక సినిమా చేస్తాడో.. లేదంటే 2019 ద్వితీయార్ధం వరకు విజయ్ కోసం మారుతీ వెయిట్ చేస్తాడో చూడాలి.

Vijay Deverakonda movie with Director Maruthi:

Vijay Deverakonda and Maruthi combo soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ