Advertisementt

ముద్దు ఇలా కూడా పెట్టుకుంటారా..!

Wed 05th Sep 2018 03:26 PM
rhea chakraborty,jalebi,first look,social media  ముద్దు ఇలా కూడా పెట్టుకుంటారా..!
Jalebi First Look Released ముద్దు ఇలా కూడా పెట్టుకుంటారా..!
Advertisement
Ads by CJ

సినీ పరిశ్రమ అంటే వింత పోకడలకు నిలయం. ఇక్కడే అనేక చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే నిర్మాత ఎమ్మెస్‌రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ నటించిన మొదటి చిత్రం 'తూనీగా తూనీగా'. ఇందులో సుమంత్‌ అశ్విన్‌కి జోడీగా రియా చక్రవర్తి నటించింది. ఈ బెంగాళీ భామ నటించిన ఆ మొదటి చిత్రం సరిగా ఆడకపోవడంతో ఆమెకి ఆ తర్వాత అవకాశాలులేవు. 

ఇక ఈమె తాజాగా 'జలేబి' (అర్ధం మాత్రం మాకు తెలియదు. కానీ జిలేబీ మాత్రం కాదు...) చిత్రంలో నటిస్తోంది. ఇందులో నుంచి తాజాగా ఓ లుక్‌ విడుదలైంది. రైలులో తలుపులోంచి రియా చక్రవర్తి కిందకి వంగి ఫ్లాట్‌ఫారంపై ఉన్న తన ప్రియుడికి లిప్‌లాక్‌ కిస్‌ ఇస్తోంది. బహుశా ఇది భలే క్రియేటివిటీ అనుకుంటున్నారేమో. కానీ ఓ బస్సులోంచి ఇలా కిస్‌ ఇస్తున్న సీన్‌ ఒకటి నాటి రోజుల్లో టివి యాడ్స్‌లో కనిపించేది. కాకపోతే బస్సుని కాస్తా ట్రైన్‌ని చేశారు అంతే తేడా...! ఈ పోస్టర్‌ని టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా షేర్‌ చేసుకుంది. కాపీ అయినా సరే ఈ పోస్టర్‌ మాత్రం నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. 

అక్టోబర్‌ 12న విడుదల కానున్న ఈ చిత్రం ద్వారా వరుణ్‌మిత్రా, దిగంగాన సూర్యవంశీలు హీరోలుగా పరిచయం అవుతున్నారు. 'నీ టైం స్టార్ట్‌ అయింది బేబీ' అంటూ రియాచక్రవర్తికి ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తాజాగా ఈ పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. అక్కడ రియా చక్రవర్తి టైం స్టార్‌ అవుతుందో లేదో గానీ ఇక్కడ మాత్రం రకుల్‌ టైం ఎండ్‌ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. కాస్త రకుల్‌ తన టైం మీద దృష్టి పెడితే బాగుంటుంది కదూ....! 

Jalebi First Look Released:

Jalebi First Look HulChul in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ