ప్రస్తుతం టీమిండియా క్రికెట్ టీం హెడ్‌కోచ్, తాను క్రికెటర్‌గా ఉన్న సమయంలో ప్లేబాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి ఆనాడు ఎందరో బాలీవుడ్ హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడు. అమృతాసింగ్ నుంచి ఎందరో ఈ కోవలోకి వస్తారు. ఇక ఆయన వివాహం చేసుకుని పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత గత కొంతకాలంగా తన భార్య నుంచి వేరుగా జీవిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో 56ఏళ్ల రవిశాస్త్రి, 36ఏళ్ల నిమ్రిత్‌తో డేటింగ్ చేస్తున్నాడని, ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం ఇంగ్లాండ్ పర్యటనలో ఉండటంతో ఆమె కూడా అక్కడే రవిశాస్త్రితో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నారన్న వార్త ఇప్పుడు బాగా హల్‌చల్ చేస్తోంది.
రవిశాస్త్రి వ్యక్తిత్వం తెలిసిన ఎవరైనా ఈ మాటలను ఇట్టే నమ్మేస్తారు. అయితే ఈ వార్తలు ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో వెంటనే ఖండించడం మంచిదని నిమ్రితా భావించినట్లుగా ఉంది. నిమ్రిత్‌కౌర్ తాజాగా స్పందిస్తూ ఈ వార్తలు నిజం కాదని చెప్పడమే కాదు.. తనదైన కొటేషన్లతో వీటిని తెలివిగా కొట్టిపడేసింది. తనదైన శైలిలో నర్మగర్భంగా ఓ ట్వీట్ చేసింది. వాస్తవం: నాకో రూట్ కెనాల్ కావాలేమో...! కాల్పనికం: నా గురించి నేను ఈ రోజు విన్నదంతా...! మరిన్ని నిజాలు : అవాస్తవాలు చాలా బాధిస్తాయి. మండే బ్లూస్ ఉన్నాయి. నాకు ఐస్‌క్రీం ఇష్టం అని ఆమె ట్వీట్ చేసింది.
హిందీలో 'లంచ్‌బాక్స్, ఎయిర్‌లిఫ్ట్' వంటి సూపర్‌హిట్ చిత్రాలలో నటించిన నిమ్రితా కౌర్ రెండేళ్లుగా రవిశాస్త్రితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2015లో జర్మనీకి చెందిన ఓ లగ్జరీ కార్ల కంపెనీ రవిశాస్త్రి, నిమ్రితాకౌర్‌లను బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించింది. అలా ఈ ఇద్దరికీ తొలి పరిచయం ఏర్పడిందట. వారిద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు రావడంతో వీటన్నింటి దృష్ట్యా అందరు నమ్మారు కానీ నమ్రితా మాత్రం తాజాగా వాటిని ఖండిచడంతోనైనా ఇలాంటి వార్తలకు బ్రేక్‌లు పడతాయా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది..!