ప్రస్తుతం హారో నుండి యూటర్న్ తీసుకుని కమెడియన్ గా సునీల్ రెండు బిగ్ ప్రాజెక్టులలో బిజీ అయ్యాడు. కమెడియన్ గా పీక్ స్టేజ్ లో ఉన్న సునీల్ హీరోగా మారాడు. రాజమౌళి వంటి దర్శకుడు సునీల్ ని ఎంకరేజ్ చేస్తే సునీల్ మాత్రం ఎందుకూరుకుంటాడు. అందుకే హీరోగా వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోయాడు. కానీ రాజమౌళి ఇచ్చిన మర్యాదరామన్న లాంటి హిట్ మళ్ళీ సునీల్ కి పడలేదు. కానీ హీరోగా మారాక మళ్ళీ కమెడియన్ గా ఎందుకులే అనుకుని వచ్చిన సినిమాలు హీరోగా చేస్తూపోయాడు. కానీ వరస వైఫల్యాలతో హీరోయిజాన్ని వదలక తప్పలేదు. ఇండస్ట్రీలో కొన్నాళ్ళు ఉండాలంటే.. అనుకుంటూ మళ్ళీ కమెడియన్ గా అవతారమెత్తాడు.
కమెడియన్ గా సినిమాలు చేస్తున్నప్పటికీ మరోపక్క హీరోయిజం మీద ఆశ చావక ఆ ప్రయత్నాలు అటు చేసుకుపోతున్నాడు సునీల్. అరవింద సమేత - వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఉండే కేరెక్టర్ చేస్తున్న సునీల్, రవితేజ అమర్ అక్బర్ ఆంటోని లో కడుపుబ్బా నటించే కమెడియన్ గా నటిస్తున్నాడు. మరో పక్క హీరోగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడట. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి నటించిన సిల్లీ ఫెలోస్ ఈ శుక్రవారం విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమాలో సునీల్ వన్ అఫ్ ది హీరో కాదంట. అల్లరి నరేష్ కి సపోర్టింగ్ కేరెక్టర్ అంటున్నారు. మరి అల్లరి పెద్దగా ఫామ్ లో లేడు. ఇలాంటి టైం లో వస్తున్న సిల్లీ ఫెలోస్ సునీల్ ని ఏ మాత్రం హైలెట్ చేస్తుందో కానీ.. ప్రస్తుతం హీరోగా సునీల్ మరో సినిమా మొదలెట్టబోతున్నాడట.
రైటర్ వెలిగొండ శ్రీనివాస్ డైరెక్షన్ లో సునీల్ నటించబోతున్నాడని ఫిలింనగర్ టాక్. ఎన్నో మాస్, కమర్షియల్ చిత్రాలకు కథలు అందించిన వెలిగొండ..... రాజ్ తరుణ్ అంధగాడుతో దర్శకుడిగా అవతారం ఎత్తాడు. అయితే ఆ సినిమా కాస్త పర్వాలేదనిపించింది. ఇక ఆ సినిమా తర్వాత సునీల్ కోసం ఒక కథ రాసుకున్నాడట. అది సునీల్‌కి నచ్చడం.... వెలిగొండతో ఓకే అనడం కూడా జరిగిందనే టాక్ నడుస్తుంది. మరి కమెడియన్ గా మారుతున్న ఈ తరుణంలో మళ్ళీ హీరో వేషాలంటూ బయలుదేరితే... ఇప్పుడొస్తున్న కమెడియన్ వేషాలు పొతే మాత్రం సునీల్ కి దెబ్బె. కాస్త ఆలోచించుకోవయ్యా సునీల్ అంటున్నారు సునీల్ అభిమానులు.