Advertisementt

‘సైరా నరసింహారెడ్డి’ క్లైమాక్స్‌పై చర్చలు

Tue 04th Sep 2018 09:51 PM
sye raa narasimha reddy,discussions,climax,chiranjeevi,mega fans  ‘సైరా నరసింహారెడ్డి’ క్లైమాక్స్‌పై చర్చలు
What About Sye Raa Climax? ‘సైరా నరసింహారెడ్డి’ క్లైమాక్స్‌పై చర్చలు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ చిరంజీవితో పాటు కొంతమంది కీలక నటులతో చిత్రీకరిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని కల్పనలను కూడా జోడిస్తున్నారట.

సినిమా మొత్తం అనుకుంది అనుకున్నట్టే వస్తుంది కానీ క్లైమాక్స్ ఎలా చూపించాలో ఇంకా యూనిట్ నిర్ణయించుకోలేదని తెలుస్తోంది. వాస్తవం ఆధారంగా సినిమాని తీస్తే.. శాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాలి. ఎందుకంటే బ్రిటిష్ వారు నరసింహరెడ్డిని ఊరి తీసి కోట గుమ్మానికి ఆయన తలను వేలాడి తీశారు కాబట్టి. అలా తీస్తే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా నిరాశ పడతారని భావిస్తున్నారు మేకర్స్.

ఈ నేపధ్యంలో మేకర్స్ కి ఓ ఆలోచన వచ్చిందంట..నరసింహారెడ్డి చావుతో కాకుండా నరసింహారెడ్డి స్ఫూర్తితో అంటే.. ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా ఆ తర్వాత కాలంలో వచ్చిన కొంతమంది విప్లవకారులను చూపించనున్నారని ఫిలింనగర్ టాక్. అంటే అల్లూరి సీతారామరాజు కాలం నాటి విప్లవకారులన్నమాట. దాని దిశగా వర్క్ చేస్తునట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

What About Sye Raa Climax?:

Discussions on Sye Raa Narasimha Reddy Climax

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ