అజర్ బైజాన్‌లో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను షెడ్యూల్ ప్రారంభం
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి నిర్మాణంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అజర్ బైజాన్‌లో షెడ్యూల్ మంగళవారం(సెప్టెంబర్ 4) నుండి స్టార్ట్ అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దానయ్య డి.వి.వి మాట్లాడుతూ.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో సినిమా అనగానే అటు మెగాభిమానులు, ఇటు ప్రేక్షకులు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో తెలిసిందే. అంచనాలను మించేలా సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా తెరకెక్కిస్తున్నాం. ఇటీవల హైదరాబాద్‌లో యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశాం. ఈ మంగళవారం (సెప్టెంబర్ 4) నుండి అజర్‌బైజాన్‌లో భారీ ఖర్చుతో కూడుకున్న కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం. 25 రోజల పాటు జరగబోయే షెడ్యూల్‌లో రామ్‌చరణ్ సహా ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను రూపొందిస్తున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’.. అన్నారు.