హీరోయిన్లు, మరీ ముఖ్యంగా తెలుగులో హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే ఇక ఫేడవుట్ ఖాయమని అందరూ నమ్ముతారు. ఇందులో ప్రేక్షకుల మైండ్‌సెట్, తోటి నటీనటులు, కో ఆర్టిస్టులు, హీరోలు, దర్శకనిర్మాతల ఆలోచనాసరళి వంటివి కూడా అలాగే ఉంటాయి. దీనికి ఏ ఒక్కరినో తప్పుపట్టి లాభం లేదు. దీనికి అందరు బాధ్యులే. కానీ సినిమా రంగంలో తొలి రెండు తరాల హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగిన కన్నాంబ, రుష్యేంద్రమణి, సావిత్రి, జమున వంటి ఎందరో ఈ విషయంలో ఇలాంటి ఆలోచన విధానం తప్పని నిరూపిస్తూనే ఉన్నారు. ఇక బాలీవుడ్‌లో పెళ్లయిన హీరోయిన్లు కూడా అద్భుత అవకాశాలు సాధిస్తూ ఉన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్న ఐశ్వర్యారాయ్ కూడా ఆమద్య తన రీఎంట్రీ చిత్రంలో లిప్‌లాక్‌లను కూడా ఓ రేంజ్‌లో పండించింది. హాలీవుడ్‌లో అయితే పెళ్లి కాని హీరోయిన్ల కన్నా, వివాహం చేసుకుని మెచ్యూర్డ్‌గా కనిపించే వారికే అందరు పెద్దపీట వేస్తుంటారు.
ఇక దక్షిణాదిలో అమలాపాల్ వంటి వారు కూడా దీనినే నిజం చేస్తున్నారు. కానీ ఈ విషయంలో సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆమె ‘రంగస్థలం’ చిత్రంలో డీగ్లామరైజ్ పాత్ర చేసిందని అందరు భావిస్తారు గానీ ఆమె పల్లెటూరి యువతిగా అంతర్లీనంగా చూపంచిన గ్లామర్‌కి ఫిదా కాని వారు ఉండరు. పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటన, గ్లామర్‌లను సమతూకంగా బ్యాలెన్స్ చేస్తూ రావడం కొద్ది దశాబ్దాలుగా ఈమెకే చెల్లింది. తాజాగా ఆమె తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ సరసన ‘సీమారాజా’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులోని ఓ సీన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
సమంత పల్లెటూరి పిల్లగా కనిపిస్తుంటే శివకార్తికేయన్ మాస్‌లుక్‌లో అదరగొడుతున్నాడు. ట్రైలర్‌లో సమంతను శివ ఎత్తుకునే సీన్ ఇప్పడు వైరల్ అవుతోంది. ఇప్పటివరకు సమంత తాను చేసిన ఏ చిత్రంలోనూ ఇలాంటి సీన్‌లో నటించలేదట. దాంతో ఈ సీన్‌ని చూసిన వారంతా ‘వామ్మో..సమంత’ అంటున్నారు. ఇందులో సమంతతో పాటు మరో పెళ్లైన హీరోయిన్ సిమ్రాన్, నెపోలియన్ తదితరులు నటిస్తుండగా, ఈ చిత్రం తమిళనాట వినాయకచవితి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో హిట్ అయితే తెలుగులోకి ఖచ్చితంగా వస్తుందని, సమంత పుణ్యాన శివకార్తికేయన్‌కి తెలుగులో కూడా క్రేజ్ వస్తుందని యూనిట్ ఎంతో ఆశతో ఉంది.