దక్షిణాదిలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా వివాదాలకు కేంద్రబిందువు వంటి హీరోగా కోలీవుడ్ స్టార్ శింబుని చెప్పవచ్చు. ఆయన సినీ కెరీర్ మాత్రమే కాదు.. ఆయన వ్యక్తిగత జీవితం కూడా పలు వివాదాలతోనే సాగుతోంది. నయనతార, హన్సిక, త్రిష ఇలా ఎందరినో నమ్మించి, ప్రేమ పేరుతో వారితో చేసిన శృంగార కార్యక్రమాలను తానే వీడియోలు తీసి వాటిని లీక్ చేసి ఎందరో హీరోయిన్ల జీవితాలను మోసం చేశాడనే చెడ్డపేరు ఉంది.
ఇక ఈయన సరసాలు, శృంగారాలకు బలైపోయిన నటీమణులే కాదు.. మహిళా సాంకేతిక వర్గానికి చెందిన వారు కూడా అనేకం. అసలు సుచిలీక్స్‌లో తెర వెనుక ముద్దాయి ఈయనే అన్న విషయం కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇక బూతు పాటలు పాడి వీడియోలు పోస్ట్ చేయడం, అడవారిని అవమానించేలా బీఫ్‌సాంగ్స్ పాడటం ఇలా ఆయన సకల కళా వల్లభుడిగానే చెప్పాలి. ఇక ఇటీవల ఓ చిత్రం విషయంలో ఒకే పార్ట్‌గా తీయాలని నిర్మాతలు, దర్శకులు భావిస్తే, ముందుగా దానికి ఒప్పుకుని ఆ తర్వాత మాత్రం రెండు పార్ట్‌లుగా తీయాలని మొండిచేసి నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చిన వివాదంలో కూడా ఆయన ఉన్నాడు. ఇక విషయానికి వస్తే శింబుపై తమిళనాడు హైకోర్టు సీరియస్ అయింది. నిర్మాత నుంచి తీసుకున్న అడ్వాన్స్‌ని వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పును తీర్చకపోతే ఆస్తులని వేలం వేయాల్సివస్తుందని ఘాటుగా స్పందించింది.
కేసు వివరాలలోకి వెళ్తే, 'అరాసన్' అనే చిత్రంలో నటించేందుకు గాను శింబు ఫ్యాషన్ మూవీ మేకర్స్ నుంచి 2013జూన్ 17న రూ.50లక్షలు శింబు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అయితే ఆ ప్రాజెక్ట్‌లో శింబు నటించలేదు. తీసుకున్న అడ్వాన్స్‌ని కూడా నిర్మాతలకు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితులు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో వడ్డీతో కలిపి మొత్తం రూ.50లక్షలకు గాను రూ.85లక్షలు చెల్లించాలని కోర్టు శింబుని ఆదేశించింది. ఇలా శింబు బాధితులైన నిర్మాతలు ఎందరో ఉన్నారని, కానీ శింబుకి, ఆయన తండ్రి టి.రాజేందర్‌కి భయపడి వారు కోర్టుల దాకా వెళ్లలేదని తెలుస్తోంది. మరి ఈ తీర్పు అయినా శింబులో మార్పు తెస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!