ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలలో సమంతకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఆమె ఏ విషయాన్నైనా మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. మహేష్‌బాబు ‘1’ (నేనొక్కడినే) చిత్రం పోస్టర్ సంచలన వ్యాఖ్యలు చేయడం నుంచి నాగచైతన్యను వివాహం చేసుకుని ‘రాజు గారి గది2’ ప్రమోషన్ల సమయంలో కూడా తాను నటించిన కొన్ని చిత్రాలను చూస్తే అందులో తాను ఎందుకు నటించానా? అనే సందేహం వస్తోందని, ఇకపై అలాంటి పాత్రలు చేయనని చెప్పింది. అన్నట్టుగానే ఆమె పెళ్లి తర్వాత విడుదలైన అన్ని చిత్రాలను చూస్తే ఆమె సినిమాలు, పాత్రల ఎంపికలో అక్కినేని కోడలిగా తన సత్తా ఏంటో చాటుతోందని చెప్పవచ్చు.
ఇక ‘అత్తారింటికిదారేది’ అనే ఇండస్ట్రీ హిట్ చిత్రంలో ఆమె పవన్‌కళ్యాణ్ సరసన నటించింది. తాజాగా ఆమె పవన్ బర్త్‌డే సందర్భంగా చేసిన ట్వీట్ పవన్ మనస్సుకు అద్దం పట్టేలా ఉందనే ప్రశంసలు లభిస్తున్నాయి. సమంత అక్కినేని తాజాగా ట్వీట్ చేస్తూ.. పవన్ నిస్వార్ధపరుడు.. ఈ తరానికి ఆయన రోల్‌మోడల్ అని వ్యాఖ్యానించింది. ప్రియమైన పవర్‌స్టార్‌కి జన్మదిన శుభాకాంక్షలు. నిస్వార్ధంగా ఉండటంలో ఈ తరానికి పవన్ ఓ ఉదాహరణ. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నామని తెలిపింది. పవన్‌కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌తో పాటు అభిమానులు, మెగా హీరోలు కూడా పలు విధాలుగా శుభాకాంక్షలు తెలిపిన తీరు అద్భుతమనే చెప్పాలి.