Advertisementt

ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేస్తా: బిగ్ బి సన్

Mon 03rd Sep 2018 12:28 PM
abhishek bachchan,wants,remake,prabhas,chatrapathi movie  ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేస్తా: బిగ్ బి సన్
Abhishek Bachchan Comments on Prabhas Film ప్రభాస్.. ఆ సినిమా రీమేక్ చేస్తా: బిగ్ బి సన్
Advertisement
Ads by CJ

వాస్తవానికి బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ ఒంటి చేత్తే బాలీవుడ్‌ని శాసించాడు. తండ్రి అమితాబ్‌,  భార్య ఐశ్వర్యారాయ్‌తో పోల్చుకుంటే అభిషేక్‌ బచ్చన్‌ మాత్రం హీరోగా పెద్ద స్టార్‌గా ఇప్పటికీ ఎదగలేకపోయాడనే చెప్పాలి. అయితే ఆయన తనకంటూ సొంత అభిమానులను ఏర్పరచుకోగలిగాడు. వైవిధ్యభరిత చిత్రాలను చేయడంలో, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే పాత్రలు చేయడంలో ఆయన ముందుంటాడు. అదే విధంగా ఇతర స్టార్స్‌ చిత్రాలలో కూడా నటించేందుకు, మల్టీస్టారర్స్‌కి సైతం ఆయన సుముఖమే. 

తాజాగా ఆయన మాట్లాడుతూ, నేను ఖాళీ దొరికినప్పుడల్లా తెలుగు సినిమాలను చూస్తూ ఉండేవాడిని. ఈమద్యకాస్త బిజీ కారణంగా చూడటం లేదు. నాకు ఖాళీ దొరికితే మాత్రం తెలుగులో ఏ చిత్రాలు విడుదలయ్యాయి? థియేటర్లలలో ఏవి సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్నాయి? వంటి విషయాలను ఎంక్వైరీ చేస్తూనే ఉంటాను. ఏదైనా సినిమా విజయం సాధించిందని తెలిస్తే దానికి గల కారణాలను విశ్లేషించుకుంటూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. మరి తెలుగులో వచ్చిన ఏ చిత్రం రీమేక్‌లో మీకు నటించాలని ఉంది? అని ప్రశ్నిస్తే దీనిలో తిరుగేలేదు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ‘ఛత్రపతి’ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఎమోషన్స్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌, రొమాన్స్‌ ఇలా నవరసాలుఉన్నాయి. ‘ఛత్రపతి’ రీమేక్‌లో నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అని చెప్పుకొచ్చాడు. నిజమే.. రాజమౌళి తీసిన చిత్రాలలో ‘విక్రమార్కుడు’ వంటివి రీమేక్‌ అయ్యాయి. మరి అభిషేక్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత అయినా ఎవరైనా అభిషేక్‌ బచ్చన్‌తో ‘ఛత్రపతి’ని రీమేక్‌ చేస్తారేమో వేచిచూడాల్సివుంది...! 

Abhishek Bachchan Comments on Prabhas Film:

Abhishek bachchan wants to remake Prabhas Chatrapathi movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ