Advertisementt

‘రెడ్డి’ కోసం చరణ్ అస్సలు రాజీపడడం లేదట!

Sun 02nd Sep 2018 03:27 PM
sye raa,ram charan,surender reddy,freedom  ‘రెడ్డి’ కోసం చరణ్ అస్సలు రాజీపడడం లేదట!
Ram Charan No compromise For Sye Raa ‘రెడ్డి’ కోసం చరణ్ అస్సలు రాజీపడడం లేదట!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్ స్టార్ హీరోగా మరోపక్క నిర్మాతగా దూసుకుపోతున్నాడు. ధృవ, రంగస్థలం హిట్స్ తో ఇప్పుడు బోయపాటి తో మాస్ ఎంటర్టైన్మెంట్ లో నటిస్తున్నాడు. ఇక నిర్మాతగా ఖైదీ నెంబర్ 150 తర్వాత భారీ బడ్జెట్ తో సై రా నరసింహరెడ్డి సినిమా చేస్తున్నాడు. తన తండ్రి తో వరసగా భారీగా సినిమాలు నిర్మిస్తున్న రామ్ చరణ్ ఇప్పుడు సై రా సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో నిర్మిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో రామ్ చరణ్.. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఎటువంటి ఆంక్షలు విధించడం లేదట.

దర్శకత్వంలో స్వేచ్ఛనివ్వడంతో పాటుగా..బడ్జెట్ పరంగా ఎలాంటి లిమిట్స్ పెట్టకుండా.. అలాగే.. సినిమా ఈ టైం కల్లా పూర్తి కావాలనే ఆంక్షలు సురేందర్ రెడ్డికి విధించకుండా రెడ్డిని బాగా నమ్మి అతనికి రామ్ చరణ్ పూర్తి స్వేచ్ఛనిచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. వృధాగా మనీ పెట్టకుండా కావాల్సిన దానికి ఖర్చు పెడుతూ.. ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతానని సురేందర్ రెడ్డికి హామీ కూడా ఇచ్చాడట. అనుకున్నట్టుగానే ఏ సీన్ కి ఎంత బడ్జెట్ కేటాయించాలో అనేది రామ్ చరణ్ పక్కా ప్లానింగ్‌తో వెళుతున్నాడట.

హీరోగా బయటి నిర్మాతల్తో చేసే రామ్ చరణ్ ఇప్పుడు తానే నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. ఇక నిర్మాతలకుండే లోటుపాట్లు, కష్టసుఖాలు రామ్ చరణ్ కి తెలుసు కాబట్టే సురేందర్ రెడ్డి విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడంటున్నారు. ఇక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి... దర్శకుడిని హడావిడి పెడితే సినిమా క్వాలిటీలో తేడా రావడం, బడ్జెట్ లిమిట్ పెడితే సినిమాలో ఉన్న రిచ్ నెస్ పోతుందని.. అలాగే సినిమాకి డెడ్ లైన్ పెట్టి పూర్తి చెయ్యమంటే సినిమా విషయంలో తేడా కొడుతుందని.. అన్ని బాగా ఆలోచించే సురేందర్ రెడ్డిపై రామ్ చరణ్ ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నాడట. ఇక సై రా నరసింహారెడ్డి ఇండియా వైడ్ గా పలు భాషల్లో తెరకెక్కుతుంది కనుకనే క్వాలిటీ విషయంలో చరణ్ రాజీపడడం లేదట. అదండీ సంగతి. 

Ram Charan No compromise For Sye Raa:

Full Freedom to Surender Reddy from Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ