Advertisementt

విజయ్ దేవరకొండ పెళ్లిపై మాట మార్చాడు

Sun 02nd Sep 2018 02:18 PM
vijay deverakonda,change,mindset,marriage  విజయ్ దేవరకొండ పెళ్లిపై మాట మార్చాడు
Vijay Deverakonda Changed his Mindset on Marriage విజయ్ దేవరకొండ పెళ్లిపై మాట మార్చాడు
Advertisement
Ads by CJ

సాధారణంగా ప్రతి ఒక్కరు ఏ కొత్త ప్రదేశానికి పోయినా ఆ ప్రాంతంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, అక్కడి వారిని అభిమానిస్తామని, అక్కడి ప్రజలు ఎంతో మంచి వారని కితాబునిస్తూ ఉంటారు. ఇక 'అర్జున్‌రెడ్డి'తో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ ఆమధ్య వరంగల్‌కి వెళ్లి తనకి వరంగల్‌ వాసులంటే ఎంతో ఇష్టమని, అక్కడి అమ్మాయినే వివాహం చేసుకుంటానని చెప్పి హంగామా చేశాడు. ఇక ఈయన తాజాగా 'గీతగోవిందం' చిత్రంతో 100కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త స్టార్‌గా ఆవిర్భవించాడు. 

ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ, నేను మొదట్లో 40ఏళ్లకు వివాహం చేసుకోవాలని భావించాను. బహుశా 'గీతగోవిందం' కారణంగానో ఏమో 35ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పటికైనా ప్రేమ పెళ్లినే చేసుకుంటాను. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకోను. ఇక పెద్దలు చేసే పెళ్లి పట్ల నాకు పెద్దగా నమ్మకం లేదు. ఇక నేను చేసుకోబోయేది తెలంగాణ అమ్మాయినా, ఆంధ్రా అమ్మాయినా, లేక విదేశాలలో ఉన్న అమ్మాయినా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. 

ప్రపంచంలోఎక్కడ ఉన్న అమ్మాయి అయినా సరే నాతో కనెక్ట్‌ కాగలిగితే చాలు. ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటాను. దానికి నార్త్‌, వెస్ట్‌, ఈస్ట్‌, సౌత్‌, అమెరికా, ఇంగ్లాండ్‌, ఉత్తారాది, దక్షిణాది అనే బేధాలు లేవు. ఇప్పటి వరకు అయితే నాకు కనెక్ట్‌ అయ్యే అమ్మాయి తారసపడలేదు. అలాంటి కనెక్ట్‌ అయ్యే అమ్మాయి దొరికిందే ఆలస్యం.. ప్రేమలో పడిపోతాను అని చెప్పుకొచ్చాడు. 

Vijay Deverakonda Changed his Mindset on Marriage:

Vijay Deverakonda About his Marriage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ