మాస్ హీరో విశాల్ 'పందెంకోడి 2' టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్
మాస్ హీరో విశాల్-ఎన్.లింగుస్వామి కాంబినేషన్‌లో 2005లో విడుదలైన 'పందెంకోడి' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పందెంకోడి 2'. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్ 25వ చిత్రంగా 'పందెంకోడి 2' రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రీ లుక్‌కి, ఫస్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, శుక్రవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. 'నేనింకా ఆడుకోవడం మొదలు పెట్టలేదు... అడ్డుకోవడం మాత్రమే మొదలుపెట్టాను' అని విశాల్ చెప్పే డైలాగ్, 'ఇది పులి, మేక ఆట కాదు.. పులి, మేక కలిసి ఆడే ఆట' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్స్ వింటుంటే ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకోవడం ఖాయం అనిపిస్తోంది. 'పందెంకోడి 2' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్ మధు తెలిపారు.
మాస్ హీరో విశాల్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాజ్‌కిరణ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాతలు: విశాల్, దవళ్ జయంతిలాల్ గడా, అక్షయ్ జయంతిలాల్ గడా, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.