Advertisementt

పరశురామ్ మరో స్టోరీ రెడీ చేశాడట..!

Sat 01st Sep 2018 01:32 PM
parasuram,next movie,geetha arts 2,banner  పరశురామ్ మరో స్టోరీ రెడీ చేశాడట..!
Parasuram next Project Details పరశురామ్ మరో స్టోరీ రెడీ చేశాడట..!
Advertisement
Ads by CJ

అల్లువారి బేనర్‌లో మూడు చిత్రాలు చేయడం అంటే అదృష్టమే. అదే అదృష్టం 'గీతగోవిందం' దర్శకుడు పరశురామ్‌కి దక్కింది. 'శ్రీరస్తు...శుభమస్తు'తో అల్లు శిరీష్‌కి మొదటి హిట్‌ని ఇచ్చి 'గీతగోవిందం'తో 10కోట్ల బడ్జెట్‌ చిత్రం ద్వారా ఏకంగా 50కోట్ల లాభాలు సాధించి పెట్టిన పరశురాంని తమ బేనర్‌లో అంటే కాదు.. కాదు.. తమ బేనర్‌లో చేయమని పలువురు నిర్మాతలు పోటీపడుతున్నారు. 

కానీ పరశురాం మాత్రం గీతాఆర్ట్స్‌2 బేనర్‌లో మరో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ చిత్రం కథ హీరోని గురువుగా దేవుడే నడిపే కథతో సాగుతుందట. అలాగని ఇది 'ఢమరుకం, గోపాల గోపాల' తరహా సబ్జెక్ట్‌ కాదని, ఎంతో వినూత్నంగా ఉంటుందని పరశురాం తెలిపాడు. అలాగని ఈ చిత్రం సోషియో ఫాంటసీ కథ కూడా కాదని, ఈ కథ బన్నీ వాసుకి ఎంతో నచ్చిందని, కథ మొత్తం పూర్తి అయిన తర్వాత నటీనటుల విషయంలో ఓ నిర్ణయానికి వస్తామని పరశురాం తెలిపాడు. 

ఏది ఏమైనా అతి తక్కువ గ్యాప్‌లో గీతాఆర్ట్స్‌లో హ్యాట్రిక్‌ చిత్రాలకు దర్శకత్వం వహిస్తోన్న పరశురాం దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించే చిత్రం కూడా త్వరలోనే ఉండనుందని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి 'గీతగోవిందం' చిత్రం పరశురాంని స్టార్‌ దర్శకుడిని చేసిందని మాత్రం ఒప్పుకోవాలి. 

Parasuram next Project Details:

Parasuram next movie also in Geetha Arts 2 Banner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ