Advertisementt

‘ఇదంజగత్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Fri 31st Aug 2018 11:09 PM
sumanth,idam jagat,release,september 28  ‘ఇదంజగత్’ రిలీజ్ డేట్ ఫిక్స్
Idam Jagat Release Date Fix ‘ఇదంజగత్’ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

కథానాయకుడు సుమంత్ నటిస్తున్న మరో వైవిధ్యమైన  చిత్రం ‘ఇదంజగత్’. అంజు కురియన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై రూపుదిద్దుకుంటోంది. అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ.. ‘‘సుమంత్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి వైవిధ్యమైన పాత్రలో ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. తొలిసారిగా సుమంత్ నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేయబోతున్నారు. విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వస్తోంది. పూర్తిగా కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సుమంత్ పాత్ర, కథకు.. ‘ఇదంజగత్’ అనే టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది. సుమంత్ పాత్ర చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయనున్నాము. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం ఉంది..’’ అని తెలిపారు.  

శివాజీ రాజా, ఛలో ఫేమ్ సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, కో-ప్రొడ్యూసర్: మురళీకృష్ణ దబ్బుగుడి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అనీల్ శ్రీ కంఠం, నిర్మాతలు: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్.

Idam Jagat Release Date Fix:

Idam jagat on September 28

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ