Advertisementt

అల్లు అర్జున్, నాని కుమ్మేశారు

Fri 31st Aug 2018 07:13 PM
allu arjun,nani,stage dance,singing,bunny  అల్లు అర్జున్, నాని కుమ్మేశారు
Allu Arjun and Nani Stage Dance at Bangkok అల్లు అర్జున్, నాని కుమ్మేశారు
Advertisement
Ads by CJ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మంచి డాన్సర్ అని మన అందరికి తెలిసిన విషయమే. కానీ మంచి సింగర్ అని మీకు తెలుసా? ఇది పక్కన పెడితే నాని కూడా మంచి సింగర్ అని మీకు తెలుసా? కానీ  డాన్సులు చెయ్యాలంటే ఎంత ఎనర్జీ ఉండాలి. అది బన్నీకి ఉంది. కానీ నాని మాత్రం డాన్సులు విషయంలో అంతంత మాత్రమే అని తెలిసిందే.

అలాంటి వీరిద్దరూ కలిసి ఒకే చోట డాన్సులు వేసి.. పాటలు పాడితే ఎలా ఉంటది? కానీ ఆ అదృష్టం కొంతమందికే దక్కింది. వీరిద్దరూ కలిసి బ్యాంకాక్ లో జరిగిన ఓ సంగీత్ ఈవెంట్ లో పాటలు పాడి డాన్సులు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్ లో సింగర్స్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ నుండి ఓ సూపర్ హిట్ సాంగ్ పాడుతుంటే..పక్కన నుండి నాని - తన వైఫ్ అంజన ఇద్దరూ కలిసి కోరస్ పాడారు.

ఆ తర్వాత అల్లు అర్జున్ - స్నేహ ‘ఆర్య-2’ నుండి మరో సూపర్ హిట్ పాటను పాడారు. అయితే వీరు ఇద్దరు కలిసి అంటే అల్లు అర్జున్, నాని కలిసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా నుండి సాంగ్ ను కలిసి పాడారు. ఇలా ఇద్దరు హీరోస్ కలిసి ఒకే స్టేజి మీద డాన్సులు..పాటలు పాడుతుంటే ఆ వీడియో చూసిన ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోతుంది. ఇలా ఒకే స్టేజి మీద ఇద్దరు హీరోస్ కనపడటం మంచి వాతావరణమే.

Allu Arjun and Nani Stage Dance at Bangkok:

Allu Arjun and Nani in one Stage

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ