Advertisementt

'పందెం కోడి 2' రిలీజ్ ఎప్పుడంటే..?

Fri 31st Aug 2018 06:50 PM
vishal,pandem kodi,release,october18  'పందెం కోడి 2'  రిలీజ్ ఎప్పుడంటే..?
Pandem Kodi 2 Release Date Fixed 'పందెం కోడి 2' రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement
Ads by CJ

అక్టోబర్‌ 18న విజయదశమి కానుకగా మాస్‌ హీరో విశాల్‌ 'పందెం కోడి 2' 

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెం కోడి 2'. గతంలో మాస్‌ హీరో విశాల్‌, ఎన్‌.లింగుస్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'పందెం కోడి 2' సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి విశాల్‌ కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న'పందెం కోడి 2'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ గురువారం విడుదల చేశారు. ఆగస్ట్‌ 31న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'పందెం కోడి 2' చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు చిత్ర సమర్పకులు ఠాగూర్‌ మధు తెలిపారు. 

మాస్‌ హీరో విశాల్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాజ్‌కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: కె.ఎ.శక్తివేల్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌., సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాతలు: విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా, దర్శకత్వం: ఎన్‌.లింగుస్వామి. 

Pandem Kodi 2 Release Date Fixed:

Pandem Kodi Release on October18

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ