ఈ వారం రెండు తెలుగు సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అందులో ఒకటి నాగ శౌర్య నటించిన '@నర్తనశాల' ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక శుక్రవారం సంతోష్ శోభన్ నటించిన 'పేపర్ బాయ్' ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొన్ని గంటల్లోనే పేపర్ బాయ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఈ గురువారం విడుదలైన నాగ శౌర్య @నర్తనశాల సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. అంటే @నాగ శౌర్య నర్తనశాలకు ప్లాప్ టాక్ వచ్చినట్లే. ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగాను మెప్పించలేకపోయింది.
@నర్తనశాల సినిమాలో దర్శకుడి పనితీరు ఆకట్టుకున్నప్పటికీ... కొన్నిచోట్ల దర్శకుడు చేసిన పొరపాట్లు ప్రేక్షకుడుకి బాగా బోర్ కొట్టించాయి. ఇంట్రెస్టింగ్ లేని స్క్రీన్ ప్లే, కామెడీ లేకపోవడం.. ఉన్న కామెడీ కూడా బోర్ కొట్టిస్తూ గందరగోళంగా ఉండడం... మ్యూజిక్ లో పస లేకపోవడం... ఏదో అలా అలా సాగిన ఫస్ట్ హాఫ్. ఇక నెమ్మదిగా సాగే కథనంతో కొంత సాధారణ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టే సెకండ్ హాఫ్.... ఇవన్నీ @నర్తనశాల మైనస్ గా నిలిచాయి. ఇక ఆ సినిమాకి కాస్త ప్లాప్ టాక్ రావడం సంతోష్ శోభన్ పేపర్ బాయ్ కి అడ్వాంటేజ్ గా మారింది.
సంపత్ నంది టీమ్ వర్క్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో పీక్స్ లో ఉండడం, మహేష్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు పేపర్ బాట్ ట్రైలర్ ని చూసి మెచ్చుకుని... సినిమాకి బూస్ట్ ఇవ్వడం.... వెరైటీగా పేపర్స్ వేస్తూ సినిమాని ప్రమోట్ చెయ్యడం.. ఇలా పేపర్ బాయ్ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఇక @నర్తనశాలకు వచ్చిన టాక్ ఇప్పుడు పేపర్ బాయ్ కి పాజిటివ్ గా మారింది. @నర్తనశాల సినిమా పోవడం పేపర్ బాయ్ కి కలిసొచ్చింది.