నా పేరు సూర్య ప్లాప్ తో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడానికి బాగా టైం తీసుకుంటున్నాడు. బాగా అంటే దాదాపుగా ఐదు నెలలు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పటికి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వడం లేదు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అనే వార్తలు మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ... అల్లు అర్జున్ నుండి మాత్రం క్లారిటీ రావడం లేదు. తాజాగా అల్లు అర్జున్ బై లింగ్యువల్ మూవీ ఒకటి తెరమీదకొచ్చింది.
నా పేరు సూర్య కన్నా ముందు అల్లు అర్జున్ తెలుగు తమిళంలో కలిపి లింగు స్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఒక బై లింగ్యువల్ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశాడు. కానీ ఏళ్లుగా అర్జున్ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి నా పేరు సూర్య సినిమా చేశాడు. కొన్ని అనుకోని కారణాలతో ఆ బై లింగ్యువల్ మూవీని వదిలేసిన అల్లు అర్జున్ ఇప్పుడు స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఆ మూవీని మొదలెట్ట బోతున్నాడని... కానీ డైరెక్టర్ గా లింగుస్వామిని తప్పిస్తున్నారనే న్యూస్ వినబడుతుంది.
లింగు స్వామి ప్లేస్ లో తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ బై లింగ్యువల్ మూవీ చేయబోతున్నాడనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. వీరం, వేదాళం చిత్రాల దర్శకుడు శివతో అల్లు అర్జున్ తో కలిసి ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. ఇంకా ఈ శివ - అల్లు అర్జున్ కాంబో మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.