నటునిగా నందమూరి కళ్యాణ్‌రామ్‌కి చెప్పుకోదగిన చిత్రాలు ‘అతనొక్కడే, హరేరామ్, పటాస్’లుగా చెప్పాలి. కానీ హరికృష్ణ కుమారుల్లో రెండో వాడైన నందమూరి కళ్యాణ్‌రామ్ ఇంకా ఆపసోపాలు పడుతున్నా కూడా.. ఆయన తమ్ముడు హరికృష్ణ మూడో కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తూ బాలయ్య తర్వాత నందమూరి వారసుడిగా దూసుకుపోతున్నాడు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు పోటీ ఉండనుంది. మరోవైపు నాగార్జునకి ‘మనం’ చిత్రం ఎలా అక్కినేని ఫ్యామిలీ చిత్రంగా మిగిలిందో... ఆ తరహా ప్రయత్నాలనే నందమూరి కళ్యాణ్‌రామ్ చేయాలని భావించాడు. ఇటీవలే తన సొంత బేనర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో తీసిన ‘జైలవకుశ’ చిత్రం ఎన్టీఆర్‌లోని నటనావిష్కరణను కొత్తపుంతలు తొక్కించింది. ఈ చిత్రం నిర్మాతగా కళ్యాణ్‌రామ్‌కి కాసుల వర్షం కురిపించింది.
ఇదే పరిస్థితుల్లో నందమూరి కళ్యాణ్‌రామ్ తన తండ్రి హరికృష్ణ, తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు తాను కూడా హీరోగా నటిస్తూ మంచి కథను సిద్దం చేయమని, ఈ చిత్రం తమకు కుటుంబ చిత్రంగా నిలిచిపోవాలనే కోరికతో కళ్యాణ్‌రామ్ మంచి స్టోరీని తయారు చేయమని రచయితలకు కూడా చెప్పాడని తెలుస్తోంది. ఈ చిత్రం కథ సిద్దం అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాను డేట్స్ అడ్జస్ట్ చేస్తానని, దీని కోసం తనకు పైసా పారితోషికం కూడా వద్దని ఎన్టీఆర్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. ఇదే నిజమై ఉంటే నందమూరి అభిమానుల కల నిజమై ఉండేది. కానీ అంతలోనే హరికృష్ణ హఠాన్మరణం చెందడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అంటున్నారు.
మరోవైపు బాలయ్య ప్రస్తుతం తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్‌గా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ చిత్రంలో నటిస్తూ తొలిసారిగా నిర్మాణభాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో సినీ, రాజకీయ రంగాలలో కూడా హరికృష్ణది కీలకపాత్ర. ఈ పాత్రకు ఆల్‌రెడీ నందమూరికళ్యాణ్‌రామ్‌ని క్రిష్, బాలయ్యలు ఎంపిక చేశారు. అయితే ఈ హఠాన్మరణం వల్ల నందమూరి అభిమానులు హీరోలు అందరూ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. బాలయ్య ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ని చేపట్టినా కూడా ఇలాంటి అవాంతరాలు వస్తూనే ఉండటం విషాదకరం. ఇక ఎన్టీఆర్ చిత్రాన్ని తన సోదరుడు హరికృష్ణకి అంకితం ఇవ్వాలని బాలయ్య భావిస్తున్నాడట. మరి ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రని ఎక్కడి వరకు? ఎలా చూపించనున్నారు? తాజా సంఘటన నేపధ్యంలో స్క్రిప్ట్‌లో ఏమైనా మార్పులు,చేర్పులు చేస్తారా? అనేది వేచిచూడాల్సివుంది.