Advertisementt

‘పేపర్‌బాయ్‌’ విషయంలో స్పందించిన అల్లు!

Thu 30th Aug 2018 10:11 PM
allu aravind,paper boy,release,sampath nandi  ‘పేపర్‌బాయ్‌’ విషయంలో స్పందించిన అల్లు!
Allu Aravind About Paper Boy Rights ‘పేపర్‌బాయ్‌’ విషయంలో స్పందించిన అల్లు!
Advertisement
Ads by CJ

సంపత్‌నంది దర్శకునిగా ‘రచ్చ, బెంగాల్‌టైగర్‌’ చిత్రాల ద్వారా తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈయన నిర్మాతగా మారి ‘గాలిపటం’ అనే ఓ చిన్న చిత్రాన్ని నిర్మించాడు. కథలో వైవిధ్యం ఉన్నా సరైన ప్రమోషన్స్‌ లేకపోవడం వల్ల ఈ చిత్రం సరిగా ఆడలేదు. ప్రస్తుతం సంపత్‌ నంది నిర్మాతగా తన రెండో చిత్రాన్ని జయశంకర్‌ దర్శకత్వంలో స్వర్గీయ దర్శకుడు, ‘వర్షం, బాబి’ చిత్రాల ఫేమ్‌ శోభన్‌ కుమారుడు సంతోష్‌శోభన్‌ హీరోగా రియా సుమన్‌, తాన్యాహోప్‌లు హీరోయిన్లుగా ‘పేపర్‌బాయ్‌’ చిత్రం నిర్మిస్తున్నాడు. 

ఈ చిత్రం హోల్‌సేల్‌ పంపిణీ హక్కులను నిర్మాత అల్లుఅరవింద్‌ తీసుకున్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. నేను ఈ సినిమా హక్కులను తీసుకోవడానికి కారణం బన్నీ. ఒకరోజున బన్నీ ఈ చిత్రం ట్రైలర్‌ వీడియోను నాకు పంపాడు. ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. యూత్‌కి కనెక్ట్‌ అవుతుందని అనిపించింది. అదే సమయంలో సంపత్‌నంది వచ్చిఈ చిత్రం ట్రైలర్‌ని ఓసారి చూడమని చెప్పాడు. ట్రైలర్‌ నచ్చడం వల్లే సినిమా చూశాను. చూశాక ఈ చిత్రాన్ని మంచి పబ్లిసిటీతో విడుదల చేయాలని అనిపించింది. అందువల్ల ఈ చిత్రం రైట్స్‌ని కొనడం జరిగిందని చెప్పుకొచ్చాడు.

Allu Aravind About Paper Boy Rights :

Allu Aravind Released Paper Boy Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ