Advertisementt

మాస్‌మహారాజా.. నాలుగు పేక ముక్కలు!

Thu 30th Aug 2018 04:03 PM
amar akbar antony,ravi teja,srinu vytla,first look  మాస్‌మహారాజా.. నాలుగు పేక ముక్కలు!
Amar Akbar Antony First Look Released మాస్‌మహారాజా.. నాలుగు పేక ముక్కలు!
Advertisement
Ads by CJ

మాస్‌ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజకి రాను రాను పోటీ బాగా పెరుగుతోంది. నాని, విజయ్‌దేవరకొండ, శర్వానంద్‌, నిఖిల్‌ వంటి వారు సత్తా చాటుతూ ఉండటం కూడా ఇందుకు కారణం. మరోవైపు రవితేజ ‘బెంగాల్‌టైగర్‌’ తర్వాత భారీ గ్యాప్‌ తీసుకుని దిల్‌రాజు-అనిల్‌రావిపూడిల కాంబినేషన్‌లో ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం చేశాడు. ఈ చిత్రాన్ని మినిమం ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన అనిల్‌రావిపూడి ఇందులో హీరోని గుడ్డివానిగా చూపించినా కూడా తనదైన, రవితేజ స్టైల్‌ని మాత్రం ఎక్కడా మిస్‌ కాలేదు. దాంతో ఈ చిత్రం విజయం సాధించింది. కానీ ఆతర్వాత చక్రి అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తే.. అతను రవితేజతో ‘టచ్‌ చేసి చూడు’ వంటి రొటీన్‌ చిత్రం చేశాడు. దీంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు రవితేజని సోలో హీరోగా ‘నీకోసం’ చిత్రంతో పరిచయం చేసి ఆ తర్వాత ‘వెంకీ, దుబాయ్‌శ్రీను’ వంటి మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని తీసిన శ్రీనువైట్ల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. 

ఇలాంటి సందర్భంలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో ఇద్దరికి ఎంతో కీలకమైన ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రం మొదలైంది. ఈ చిత్రం ద్వారా గోవా బ్యూటీ, రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ తర్వాత తెలుగులో కనుమరుగైన ఇలియానా ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. ఇందునా వరుస కథాబలం ఉన్న చిత్రాలతో నిర్మాతలుగా దూసుకువెళ్తోన్న మైత్రి మూవీమేకర్స్‌ చిత్రం దీనిని రూపొందిస్తుండటం దీనికి మరో బలం. దిల్‌రాజు లానే మైత్రిమూవీమేకర్స్‌ సంస్థ రవితేజకి హిట్‌ని ఇస్తుందో లేదో వేచిచూడాల్సివుంది. ఇక ఈ చిత్రంకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని రవితేజ ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశాడు. రవితేజ ఇందులో మూడు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నాడని గతం నుంచి వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ రవితేజ క్లాస్‌, మాస్‌, ఫన్నీలుక్స్‌తో మూడు పేకలపై కనిపిస్తున్నారు. దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. 

Amar Akbar Antony First Look Released:

Ravi Teja and Srinu Vytla Film Amar Akbar Antony First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ