రామ్‌చరణ్.. తన రెండో చిత్రంతోనే ‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ‘దృవ’ నుంచి వైవిధ్యభరిత చిత్రాల వైపు మొగ్గుచూపుతున్నాడు. అదే ఆయనకు ‘రంగస్థలం’ వంటి ఎవర్‌గ్రీన్ హిట్‌ని అందించింది. ఓవైపు కొణిదెల బేనర్‌ని స్థాపించి నిర్మాతగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ ప్రతిష్టాత్మక చిత్రం, పదేళ్ల తర్వాత చిరు రీఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీనెంబర్ 150’ నిర్మించాడు. ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో ‘బాహుబలి’ తర్వాత మరో భారీ ప్రాజెక్ట్‌ను తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాధను సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఇందులో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్, విజయ్‌సేతుపతి, కిచ్చాసుదీప్, నయనతార, తమన్నా వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.
ఇక తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే గిఫ్ట్‌గా ‘సై...రా..నరసింహారెడ్డి’ చిత్రం టీజర్‌ని విడుదల చేసి మెగాభిమానులకు మెగా ట్రీట్ ఇచ్చిన ఆయన ప్రస్తుతం తన బాబాయ్ పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన మెగాఫ్యాన్స్‌కి మరో డబుల్‌ట్రీట్ ఇవ్వనున్నాడు. పవన్ బర్త్‌డే అంటే ఆయన జరుపుకున్నా జరుపుకోకపోయినా కూడా అభిమానులకు పండగ రోజు. ఇప్పుడు ఆయన తన బాబాయ్ బర్త్‌డే సందర్భంగా తాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ని కూడా అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇందులో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పోలీసు ఆధికారి పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను పవర్‌ఫుల్ టైటిల్స్ పెట్టడంలో నేర్పరి కావడంతో ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ని పవర్‌ఫుల్‌గా చూపించడమే కాదు.. అందుకు తగ్గ పవర్‌ఫుల్ టైటిల్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రాన్ని వరస విజయాలతో దూసుకెళ్తున్న నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తుండగా, కైరా అద్వానీ హీరోయిన్‌గా, స్నేహ, ప్రశాంత్, ఆర్యన్‌రాజేష్ వంటి అన్నావదినల సెంటిమెంట్ దీనికి ప్రత్యేక ఆకర్షణ కానుంది. వివేక్ ఒబేరాయ్ పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషించనున్నాడు. మరోవైపు చరణ్ దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలసి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్నాడు. మరోవైపు తమిళంలో ‘తని ఒరువన్’గా రూపొంది ఘన విజయం సాధించిన చిత్రాన్ని రామ్‌చరణ్ ‘ధృవ’ పేరతో రీమేక్ చేశాడు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు మోహన్‌రాజా జయం రవి హీరోగానే ‘తని ఒరువన్’ సీక్వెల్‌ని ప్రకటించాడు. సో.. ఈ సీక్వెల్ హిట్టయితే రామ్‌చరణ్ రాజమౌళి చిత్రం తర్వాత చేసే చిత్రం ‘ధృవ’ సీక్వెల్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.