తెలుగులో 'మజ్ను' సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన నటి అను ఇమ్మాన్యుయేల్.. కేవలం ఒకేఒక్క సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన త్రివిక్రమ్ డైరెక్షన్ లో 'అజ్ఞాతవాసి' సినిమాతో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఆ తర్వాత చేసిన అల్లు అర్జున్ 'నాపేరుసూర్య' సినిమాతో వరసగా డిజాస్టర్స్ అందుకుంది.
ఎన్నో అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలు ప్లాప్ అవ్వడంతో అను నిరాశకు గురైంది. కానీ తమిళంలో 'నాపేరుసూర్య' సినిమాకు మంచి టాకే వచ్చింది. ఇక తమిళంలో ఆమె నటించిన 'తుప్పారివాలన్' తెలుగులో 'డిటెక్టివ్' గా వచ్చింది. ఆ సినిమా తెలుగులో మంచి టాక్ అందుకుంది. తన నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం ఆమెకు తమిళంలో విజయ్ సేతుపతికి జోడిగా నటించే అవకాశం వచ్చిందంట. తమిళంలో విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ ఉండటంతో ఆమె ఏమీ ఆలోచించకుండా ఆ సినిమాకి ఓకే చెప్పేసిందని టాక్. ప్రస్తుతం అను తెలుగులో 'శైలజారెడ్డి అల్లుడు' వచ్చే నెల సెప్టెంబర్ 13 న విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాతో అనుకి తెలుగులో మంచి బ్రేక్ వస్తుందని ఆమె ఆశిస్తుంది. మరి ఈ మూవీతో ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.