టాలీవుడ్, కోలీవుడ్ నుంచే కాదు.. బాలీవుడ్ వరకు కూడా ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నేత టి.సుబ్బరామిరెడ్డికి ఇచ్చే పార్టీలు, ఆయన చేసే సన్మానాలు, ఘనంగా ఆయన నిర్మించే చిత్రాలలో నటించడానికి, హాజరుకావడానికి అందరూ క్యూలో ఉంటారు. అలా అందరినీ కలుపుకుపోవడం, పలువురు ప్రముఖులతో సన్నిహిత సంబంధాల విషయంలో కూడా తిక్కవరపు సుబ్బరామిరెడ్డిది ప్రత్యేకశైలి.
ఇక తాజాగా ఈయన కుమార్తె పింకి రెడ్డి కూడా తాను తండ్రికి తగ్గ తనయని అని నిరూపించుకుంటోంది. తాజాగా ఈమె ఇచ్చిన పార్టీకి టాలీవుడ్ నటీమణులు సమంత, తమన్నా, ఆదితీరావు హైదరీలతో సహా సాధారణంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే అక్కినేని అమల కూడా హాజరై ఆశ్చర్యచకితులను చేసింది. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను తాజాగా సమంత, తమన్నాలు సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ పార్టీ అద్భుతంగా ఉందంటూ పింకీ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 'రా మ్యాంగో' సంస్థ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చక్కటి విందులని పింకీ రెడ్డి ఏర్పాటు చేసినందుకు ఆమెకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పింకీరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే తమన్నా ఓ ట్వీట్ చేసింది. ఇంతకాలం తర్వాత తనకు తమన్నా, అమల మేడమ్‌లను కలిసే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆ పార్టీని ఏర్పాటు చేసిన సంజయ్‌గర్గ్, పింకీరెడ్డిలకు అదితిరావు హైదరీ కూడా కృతజ్ఞతలు తెలిపింది. మొత్తానికి పార్టీలు ఏర్పాటు చేసి, ప్రముఖులను పిలిచి ఆదరించడంలో పింకీ రెడ్డి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుందనే చెప్పవచ్చు.