Advertisementt

వైరల్‌ అవుతోన్న సైరా పిక్‌!

Thu 30th Aug 2018 12:43 PM
pawan kalyan,chiranjeevi,amitabh bachhan,sye raa,sets  వైరల్‌ అవుతోన్న సైరా పిక్‌!
Pawan Kalyan at Sye Raa Sets వైరల్‌ అవుతోన్న సైరా పిక్‌!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి, బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌లు ఒకే సీన్‌లో కనిపించారంటే అది ఎంతటి సంచలనం సృష్టిస్తోందో అందరికీ తెలిసిందే. సాధారణంగా తెరపై మెగాస్టార్‌ చిరంజీవి కనిపిస్తేనే అది పండుగ వాతావారణం సృష్టిస్తుంది. అలాంటిది మెగాస్టార్‌, బిగ్‌బిలు కలిశారంటే అభిమానులకు కేకో కేక. ఇక ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి తన 151వ ప్రతిష్టాత్మక చిత్రంగా 'సై...రా...నరిసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నాడు. తమ హోమ్‌బేనర్‌ అయిన కొణిదెల ప్రొడక్షన్స్‌ లో రూపొందుతున్న ఈ చిత్రానికి మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నిర్మాత అన్న విషయం తెలిసిందే. 'బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టి, నాన్‌-బాహుబలి రికార్డుల స్థానంలో 'సైరా...' రికార్డులను లిఖించాలని మెగా ఫ్యామిలీ ఎంతో పట్టుదలగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో వేగంగా జరుగుతోంది. 

ఇక ఇందులో మెగాడాటర్‌ కొణిదెల నిహారికతో పాటు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాన్‌ కూడా నటిస్తున్నాడని వస్తున్న వార్తల్లో నిజం ఎంతో తెలియదుగానీ మెగాభిమానులు ఈ విషయం విని ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. తాజాగా 'సై..రా' చిత్రం షూటింగ్‌కి సంబంధించిన ఓ పిక్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోలో బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, ప్రముఖ రచయిత సత్యానంద్‌లు ఉన్నారు. 'సై..రా'తో తాము పోషిస్తున్న పాత్రల గెటప్‌లోనే బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌, మెగాస్టార్‌ చిరంజీవిలు ఉండటం విశేషం. 

అయితే మూడు నాలుగు నెలల కిందట దిగిన ఈ ఫొటో ఇప్పుడు బయటకి రావడానికి మాత్రం రచయిత సత్యానంద్‌ కారణమనే చెప్పాలి. చిరంజీవి నటించిన ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు రచయితగా పనిచేసిన సత్యానంద్‌ ఈ ఫొటోని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో బిగ్‌బి అమితాబ్‌తో పాటు మెగాహీరోలు, సత్యానంద్‌ ఉన్నారు. ఈ ఫోటోని ఫ్రేమ్‌ చేయించి మరీ మెగాస్టార్‌ చిరంజీవి సత్యానంద్‌కి పంపారట. ఇన్నిరోజుల తర్వాత ఈ ఫొటోను పోస్ట్‌ చేయడంతో దీనిని మెగాభిమానులు వైరల్‌ చేస్తున్నారు. మరి ఫొటోకి ఇంతటి స్పందన వస్తుంటే రేపు స్క్రీన్‌పై కనిపిస్తే మెగాభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. 

Pawan Kalyan at Sye Raa Sets:

pawan kalyan, chiranjeevi, amitabh bachhan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ