బాలనటిగా పరిచయమైన తర్వాత 'చంటి' చిత్రంతో హీరోయిన్‌గా విపరీతమైన క్రేజ్‌ని సంపాదించిన నటి మీనా. ఈమె తెలుగు టాప్ స్టార్స్‌తో పాటు దక్షిణాది టాప్ హీరోలందరితో కలిసి నటించింది. అలాంటి మీనా తాజాగా మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక విచారకరమైన అంశమని తెలిపింది. మా కాలంలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయి. అయితే అలాంటి అనుభవాలు నాకు ఎదురుకాలేదు. వక్రబుద్ది కలిగిన మగాళ్లు ఇప్పటికైనా మారాలి. ఒక స్త్రీతో డీల్ చేసేముందు తమకు కూడా భార్యాపిల్లలు ఉన్నారనే విషయం గుర్తించాలి.
నా కెరీర్‌లో అగ్రహీరోలందరితో కలిసి నటించాను. చిరంజీవి నుంచి రజనీకాంత్ వరకు ప్రతి ఒక్కరితో కలిసి పనిచేశాను. కానీ అరవింద్ స్వామితో మాత్రం కలిసి నటించలేకపోయాను. ఆయనతో నటించే అవకాశాలు వచ్చినా కాల్షీట్స్ కారణంగా వాటిల్లో యాక్ట్ చేయలేకపోయాను. అలాగే విజయ్‌తో ఎన్నో చిత్రాలలో అవకాశం వచ్చినా ఆయనతో కూడా నటించలేకపోయాను. విజయ్‌తో నటించలేకపోయాననే కొరతను తీర్చుకునేందుకే 'షాజహాన్' చిత్రంలో ఓ పాటలో డ్యాన్స్ చేశాను... అని చెప్పుకొచ్చింది.
ఇప్పుడు ఈమె పాప కూడా బాలనటిగా బాగా రాణిస్తోంది. తల్లి విజయ్‌తో నటించలేకపోయినా కూడా మీనా కుమార్తె మాత్రం విజయ్‌తో కలిసి బాలనటిగా 'తేరీ' చిత్రంలో నటించడం విశేషం. మరి ఇంత పాపులారీటీ ఉన్న మీనా కాస్టింగ్‌కౌచ్ తమ కాలంలో ఉన్నదని చెప్పడం సంచలనంగా మారిందనే చెప్పాలి.