ప్రముఖ నటుడు, టీడీపీ పొలిటికల్ బ్యూరో మెంబెర్ నందమూరి హరికృష్ణ ఈరోజు ఉదయం హైదరాబాద్ సమీపంలో రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. అతి వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. హరికృష్ణ మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి లోనయింది.
ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున చేసిన ట్వీట్ కంటతడిపెట్టిస్తోంది. ‘‘నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే ఆయన నాతో అన్నారు కానీ ఇప్పుడు ఆయన ఇక లేరు, మిస్ యు అన్న’’ అని చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు నాగ్.
గతంలో ‘సీతారామరాజు’ సినిమాలో హరికృష్ణ, నాగార్జున అన్నాతమ్ముళ్లుగా నటించారు. నాగ్ ఆ సినిమాకు సంబంధించి ఓ ఫోటో షేర్ చేస్తూ ఇలా ట్వీట్ చేశాడు. ఇక కాజల్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, సాయిధరమ్ తేజ్, హరీశ్ శంకర్, దేవీశ్రీ ప్రసాద్, మంచు లక్ష్మి, మంచు విష్ణు, మంచు మనోజ్, అల్లు శిరీష్, కోన వెంకట్ తదితరులు హరికృష్ణకు నివాళులు అర్పించారు.