Advertisementt

నందమూరి హరికృష్ణ ఇక లేరు

Wed 29th Aug 2018 07:42 PM
harikrishna,nandamuri harikrishna,nandamuri family  నందమూరి హరికృష్ణ ఇక లేరు
Nandamuri Harikrishna is no more నందమూరి హరికృష్ణ ఇక లేరు
Advertisement
Ads by CJ

నందమూరి కుటుంబంలో విషాదం. నందమూరి హరికృష్ణ తన తుది శ్వాస విడిచారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన తన మిత్రుడు మోహన్ కుమారుడు కొడుకు పెళ్ళికి వెళ్తుండగా నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఆయన కార్ రోడ్డు ప్రమాదానికి గురైంది. 160 కిలోమీటర్ వేగంతో వెళ్తున్న హరికృష్ణ కార్ ఆయనే స్వయంగా నడుపుతున్నట్టు తెలుస్తుంది.

ప్రమాదంలో జరిగినప్పుడు కార్ లో హరికృష్ణతో పాటు మరో ఇద్దరు ఉన్నారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ కార్ లో నుండి బయటికి పడిపోయారు. అక్కడ స్థానికులు హరికృష్ణను దగ్గరలో ఉన్న కామినేని హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆయన తుది శ్వాస విడిచారు.

ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని తన కొడుకులు ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్ కామినేని హాస్పిటల్ కి చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మరి కొద్దిసేపట్లో కామినేని హాస్పిటల్‌కు వెళ్లనున్నారు.

Nandamuri Harikrishna is no more:

Nandamuri Harikrishna passess away

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ