Advertisementt

స్టార్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిపోవచ్చా?

Wed 29th Aug 2018 12:21 PM
adithi rao hydari,star heroine,maniratnam  స్టార్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిపోవచ్చా?
Adithi Rao Hydari Star Heroine స్టార్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిపోవచ్చా?
Advertisement
Ads by CJ

పేరుకి హిందీ భామే గానీ ఆమెది హైదరాబాద్‌ జన్మస్థలం. తన మొదటి చిత్రమే ఎందరో హీరోయిన్లు కనీసం తమ కెరీర్‌లో ఒక్కసారైనా నటించాలని ఆశపడే దిగ్రేట్‌ లెజెండ్‌ మణిరత్నం చిత్రంలో నటించింది. తెలుగులో 'చెలియా'గా వచ్చిన ఇందులో ఆమె హీరో కార్తి సరసన నటించింది. కానీ ఈ చిత్రం సరిగా ఆడలేదు. దాంతో అందరితో పాటు ఆమె కూడా ఉసూరుమంది. ఆ తర్వాత ఆమెకి తెలుగులో హీరోయిన్లను ఎంతో బాగా తెరపై చూపించే ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో హీరో సుధీర్‌బాబు సరసన 'సమ్మోహనం' చిత్రంలో నటించింది. ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించడంతో పాటు ఈమె నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇదే సమయంలో ఐశ్వర్యారాయ్‌ వంటి వారిని తప్ప ఎవరితోనూ పెద్దగా హీరోయిన్లను కంటిన్యూ చేయని మణిరత్నం తన తాజా చిత్రం 'నవాబ్‌'లో సైతం ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఈమెలోని స్టార్‌ హీరోయిన్‌ అయ్యే గుణాలను గుర్తించిన మణిరత్నం ఆమెని 'చెలియా' తర్వాత తాను తీస్తున్న తదుపరి చిత్రంలోనే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తనకి మంచి గుర్తింపును తెచ్చిపెడుతుందనే ఆశతో ఆదితీరావు హైదరీ ఉంది. 

తాజాగా ఆమెకి కోలీవుడ్‌లో మరో అవకాశం లభించింది. మిస్కిన్‌ దర్శకత్వంలో ఉదయ్‌ నిధి స్టాలిన్‌ హీరోగా నటించనున్న చిత్రంలో ఆమెకి హీరోయిన్‌ అవకాశం వచ్చిందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ రెండు చిత్రాలు హిట్టయితే మాత్రం ఆదితీరావు హైదరీ మరోస్టార్‌ హీరోయిన్‌గా ఉద్బవించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి 'నవాబ్‌, మిస్కిన్‌' చిత్రాలు ఆదితీరావుకి ఎలాంటి ఫలితాలను అందజేస్తాయో వేచిచూడాల్సివుంది! 

Adithi Rao Hydari Star Heroine:

Adithi Rao Hydari Star Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ