Advertisementt

ఎస్పీ బాలు.. ర్యాగింగ్‌ గురించి..!

Wed 29th Aug 2018 12:02 PM
sp balasubramanyam,sp balu,ragging,college days,singer  ఎస్పీ బాలు.. ర్యాగింగ్‌ గురించి..!
SP Balu about his College days Ragging ఎస్పీ బాలు.. ర్యాగింగ్‌ గురించి..!
Advertisement
Ads by CJ

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దాదాపు 50వేల పాటలు పాడి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను అనంతపురం జెఎన్‌టియు కాలేజీలో చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు. సంగీత కుటుంబం నుంచి వచ్చిన నాకు అనంతపురంలోని జెఎన్‌టియు కాలేజీలో ఇంజనీరింగ్‌ సీటు వచ్చింది. అక్కడ నేను కేవలం ఎనిమిది నెలలే చదువుకున్నాను. అప్పట్లో ర్యాగింగ్‌ విపరీతంగా ఉండేది. దాని నుంచి నేను తప్పించుకోవడానికి కూడా సంగీతమే ఉపయోగపడింది. 

నేనుకాలేజీలో పాటల పాడేవాడిని. దీంతో పాటు కొద్దొగొప్పో ఫ్లూట్‌ కూడా వాయించేవాడిని. దాంతో సీనియర్లు వాడిని వదిలేయండిరా అనేవారు. కాలేజీలో నాకు మరో ఇద్దరు తోడయ్యారు. వారిలో ఒకరు తబలా, మరోకరు బ్యాంజో వాయించేవారు. దీంతో చిన్న సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్‌ చేసేవాళ్లం. అలా నా సంగీతమే కాలేజీలో నన్ను ర్యాగింగ్‌కి గురి కాకుండా ఆపింది.. అంటూ నవ్వుతు చెప్పుకొచ్చాడు. 

ఇక బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు పాటలు పాడటం బాగా తగ్గించి, యువ గాయనీ గాయకులను పైకి తీసుకు వచ్చేందుకు ‘పాడుతా తీయగా’ ఇతర మ్యూజికల్‌ నైట్స్‌ ద్వారా బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారు. అయితే బాలు తర్వాత అంత లాంగ్‌ కెరీర్‌ని ఏకంగా 50వేలకు పైగా పాటలను పాడే వారు ఎవ్వరూ ఉండకపోవచ్చనే చెప్పాలి.

SP Balu about his College days Ragging :

SP Balu about his College Days

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ