టాలీవుడ్‌లో ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవికి పోటీగా నిలిచిన హీరో సుమన్. ఈయన కెరీర్ బ్లూఫిల్మ్ కేసులో ఇరుక్కున్న తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. అప్పటివరకు మహిళలు, యువతులలో యమా ఇమేజ్ ఉన్న సుమన్ కెరీర్ డౌన్‌ఫాల్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత ‘శివాజీ’లో విలన్‌గా నటించినా, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి చిత్రాలలో శ్రీవేంకటేశ్వరస్వామిగా, శ్రీరామునిగా మెప్పించినా ఆయన ఆ క్రేజ్‌ని నిలబెట్టుకోలేకపోయాడు. ఎన్టీఆర్ తర్వాత ఆ తరహా పాత్రలకు సుమన్ సరిగా సరిపోయాడని ప్రేక్షకుల మన్ననలు పొందిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ.. తాను 9 భాషల్లో 400 చిత్రాలలో నటించానని, ఓ హాలీవుడ్ చిత్రంలో పనిచేసే అవకాశం వచ్చిందని చెబుతూ, రాజకీయంగా తనకు చంద్రబాబు గురువు వంటి వారని, ఆయన సోదరుడు రామ్మూర్తినాయుడు నన్ను చంద్రబాబుకి పరిచయం చేశాడని చెప్పుకొచ్చాడు. అలా చంద్రబాబుతో కలిసి టిడిపికి ఏ పదవి ఆశించకుండా నిస్వార్ధంగా ప్రచారం చేశానని, సినీ పరిశ్రమలో తనకి పరిచయం లేకపోయినా కూడా పలువురు దర్శకనిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు నాకెంతో సహకరించారన్నారు.
సినీ కెరీర్‌లో ఒడిదుడుకుల ఎదుర్కొన్న తాను కరాటే వల్లనే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నియత్రించుకున్నానని, క్రమశిక్షణ కలిగి, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చని ఆయన తెలిపారు. ఇక పవన్‌కి మంచి క్రేజ్ ఉందని, అయితే తాను గ్రహబలాన్ని, జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతానని, గ్రహఫలం బాగుంటే పవన్‌కి సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని సుమన్ అన్నారు. తన దృష్టిలో దేవుడు కరుణించడం, విధి రాత రాసి ఉండటం అనేది కీలకమని, అలా అన్ని కుదిరితే పవన్ సీఎం అవుతాడని చెప్పుకొచ్చాడు.