ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్‌పై జరిగినంత రగడ, రచ్చ మరోదానిపై జరగలేదంటే అతిశయోక్తికాదు. కొందరు ఇది నిజమేనంటే.. మరికొందరు కాదు అంటున్నారు. కొందరేమో కాస్టింగ్‌కౌచ్ ఉన్నది నిజమేనని, కానీ తమకు ఆ అనుభవాలు ఎదురుకాలేదని అంటున్నారు. మరికొందరు మనం ఒప్పుకుంటేనే అది సాధ్యమని, ప్రతి రంగంలోనూ ఇది ఉన్నదే అని ముక్తాయింపును ఇస్తున్నారు.
ఇక విషయానికి వస్తే తాజాగా వర్ధమాన నటి ప్రియా భవాని శంకర్ మరోసారి కాస్టింగ్‌కౌచ్ విషయాన్ని మరలా రేపి సంచలనం సృష్టిస్తోంది. సద్దుమణుగుతున్న వివాదాన్ని మరింత రేపింది. బుల్లితెరపై ఇంతకాలం సందడి చేసిన ప్రియా ఇప్పుడిప్పుడే వెండితెరపై కూడా బిజీ అవుతోంది. ఇటీవలే ఆమె కార్తి సరసన ఓ చిత్రంలో నటించింది. ఈమద్య ఆమె మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్‌కౌచ్ నిజమేనని, స్పష్టం చేసింది. ఈ వేధింపులు అన్ని రంగాలలో ఉన్నాయని ప్రియా చెప్పుకొచ్చింది.
అయితే వాటిని అంగీకరించడం లేదా తిరస్కరించడం మన చేతుల్లోనే ఉంది. లైంగిక వేధింపుల గురించి శ్రీరెడ్డి పబ్లిక్‌గా చెప్పడం సరికాదు. తప్పు చేసి బయటకి చెప్పి అందరిపై బురదజల్లడం ఎంత వరకు సమంజసం? వేధింపుల నుంచి బయట పడాలంటే నటన నుంచైనా తప్పుకోవచ్చు కదా! నేను మాత్రం కుటుంబ కథా చిత్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నానని ఆమె చెప్పడం చూస్తుంటే ఈమె వాదన కూడా సరిగా ఉందనే చెప్పాలి..!