Advertisementt

హాట్ టాపిక్: మెగాస్టార్‌ రక్షాబంధన్‌ వేడుక

Wed 29th Aug 2018 10:50 AM
rakhee celebrations,chiranjeevi house,megastar chiranjeevi  హాట్ టాపిక్: మెగాస్టార్‌ రక్షాబంధన్‌ వేడుక
Rakhee Celebrations at Megastar House హాట్ టాపిక్: మెగాస్టార్‌ రక్షాబంధన్‌ వేడుక
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి సొంత సోదరీమణులైన చెల్లెళ్లు మాధవి, విజయలు మెగాస్టార్‌కి రాఖీ కట్టి దీవెనలు అందుకున్నారు. సోదరీమణులు ఇద్దరు సంప్రదాయ బద్దంగా సోదరుడికి హారతి ఇచ్చారు. ఆ తర్వాత అన్నయ్యకు మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన సోదరీమణులకు కానుకలు అందజేశారు. తన తోబుట్టువులను దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్‌ చిరంజీవి కోడలు, రామ్‌చరణ్‌ శ్రీమతి, సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ఎంతో వైరల్‌ అవుతోంది. 

'ప్రియమైన సోదరీమణులతో మావయ్య మెగాస్టార్‌ చిరంజీవి రక్షాబందన్‌' వేడుకలు అంటూ ట్వీట్‌ చేసింది. మరోవైపు పవన్‌కళ్యాణ్‌ కూడా రాఖి కట్టినా కట్టకపోయినా ఆడపడుచులందరు మనసోదరీమణులేనని, వారి గౌరవాన్ని కాపాడాలని తన అభిమానులకు పిలుపు ఇచ్చారు. ఇలా మెగాస్టార్‌ చిరంజీవి ఇంట రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరగడంతో మెగాభిమానులు ఎంతో ఉబ్చితబ్బిబవుతున్నారు. 

మరోవైపు చిరంజీవి తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ 'సై..రా..నరసింహారెడ్డి' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 'బాహుబలి' తర్వాత తెలుగులో అంత ప్రతిష్టాత్మకంగా వస్తోన్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో కలిపి వచ్చే ఏడాది వేసవిలో గానీ లేదా ఏడాది చివర గానీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Rakhee Celebrations at Megastar House:

Rakhee Celebrations at chiranjeevi House

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ