RRR.... ఈ పేరు వెనుక మర్మమేమో ఊహాగానాలే తప్ప అసలు విషయం అంతు చిక్కనప్పటికీ ఈ పేరు గత కొన్ని నెలలుగా యావత్ సినీ లోకాన్ని విస్మయానికి గురి చేయటంతో పాటు, చిత్రీకరణ దశకి చేరుకోక మునుపే ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకిస్తుంది.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సంచలనాత్మక దర్శకుడు రాజమౌళి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల జాబితాలో వున్న తారక్, చరణ్ లను ఎంచుకుని పెద్ద సాహసమే చేయగా, రాజమౌళి ఊహను తెరపై రాజీపడకుండా ప్రేక్షకులకి చూపించటానికి నిర్మాత డి.వి.వి.దానయ్య స్క్రిప్ట్ లాక్ కాకముందే తారక్ మరియు చరణ్ ల కాల్ షీట్స్ బుక్ చేసి పెట్టుకున్నారు.
సినిమా ప్రకటన వచ్చి అనేక మాసాలు గడిచిపోతున్నా రాజమౌళి ఇంకా స్క్రిప్ట్ లాక్ చేయకపోవటం గమనార్హం. ఇద్దరు బడా హీరోల కాల్ షీట్స్ ఏకకాలంలో సర్దుబాటు చేసుకోటానికే నేటి తరం నిర్మాతలు సతమతమవుతుంటే ఇలా తారక్, చరణ్ ల డేట్స్ వృధా అవుతున్నా నిర్మాత దానయ్య ప్రాజెక్ట్ ని నమ్మి రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ కి కావలసినంత అదనపు సమయం కేటాయిస్తూ సహకరిస్తున్నారు. పాపం నిర్మాత... ఇద్దరు బడా హీరోల కాల్షీట్స్ హోల్డ్ లో పడిపోతున్నా నిర్మాత నుంచి అనుకూల స్పందన ఏర్పరచుకోవటం కేవలం రాజమౌళికి మాత్రమే సాధ్యం అవుతుంది ఏమో...!